కర్నూల్

రైతు సంక్షేమమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, మే 26:రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కెఇ ప్రతాప్ స్పష్టం చేశారు. మండల పరిధిలోని కొచ్చెర్వు గ్రామంతో పాటు పట్టణంలోని కోర్టు దగ్గర, కొండపేటలో మీ సేవా కేంద్రాలను గురువారం కెఇ ప్రతాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులతో పాటు సామాన్యులకు సైతం మెరుగైన సేవలను అందివ్వాలనే ఉద్దేశ్యంతో సిఎం చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. మీ సేవా కేంద్రాల ఏర్పాటు వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. భూములతో పాటు స్థిర, చరాస్థుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం శక్తి వంఛన లేకుండా పాటుపడతానన్నారు. చెరువుల్లో పూడిక తీత కార్యక్రమాలు చేపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమం రైతులకు వరమన్నారు. కొచ్చెర్వులో చెరువులోని మట్టిని రైతులు తీసుకెళ్లడానికి ఎవ్వరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. జూన్ 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు ప్రొక్లైన్‌ను సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు చెరువు మట్టిని స్వచ్ఛందంగా తీసుకెళ్లవచ్చని, ఎవరైనా చెరువు మట్టికి డబ్బులడిగితే తనకు సమాచారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ కొట్రికె గాయత్రిదేవి, వైస్ చైర్మన్ టిఇ కేశన్నగౌడ్, తహశీల్దార్ మునికృష్ణయ్య, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు తిమ్మయ్య యాదవ్, ఎంపిపి టిఇ లక్ష్మిదేవి, వైస్ ఎంపిపి టివి చలం, మాజీ ఎంపిపి టిఇ శేషఫణి గౌడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్, శ్రీనివాసులు గౌడ్, నాయకులు పాల్గొన్నారు.