కర్నూల్

సామాన్యులకో న్యాయం.. బడా నేతలకు మరో న్యాయమా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, మే 26:పట్టణంలో కెజి రహదారి విస్తరణ సందర్భంగా మున్సిపల్ అధికారులు చిన్నా చితకా వ్యాపారులకో న్యాయం, బడా నేతలకు ఒక న్యాయం పాటించడం ఏంటని 11వ వార్డు కౌన్సిలర్ గీతారాణి ప్రశ్నించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ ఓస్పరి సుబ్బమ్మ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతారాణి మాట్లాడుతూ విస్తరణను ఆగమేఘాల మీద ప్రారంభించిన మున్సిపల్ అధికారులు కెజి రోడ్డుకు ఇరువైపులా వుండే దుకాణాలను నేలమట్టం చేశారన్నారు. అదే బడా నేతల కాంప్లెక్స్, దుకాణాలను ఇప్పటికీ కూల్చివేయకపోవడంలో ఆంతర్యం ఏంటని, ఎప్పుడు కూల్చివేస్తారని ప్రశ్నించారు. మే 11వ తేదీ విస్తరణ పనులు ప్రారంభించి దుకాణాలు కూల్చడంతో వ్యాపారులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడా నేతల దుకాణాల జోలికి వెళ్లకపోవడంతో ఆ దుకాణాల వారు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఇదెక్కడి న్యాయమన్నారు. రహదారి విస్తరణ పనులు త్వరగా ముగిస్తే వ్యాపారులు మళ్లీ దుకాణాలు నిర్మించుకుని వ్యాపారం చేసుకుంటారన్నారు. అనంతరం 21 అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ లక్ష్మినారాయణరెడ్డి, డిఇ నాగభూషణంరెడ్డి, ఆర్‌ఓ శివప్రసాద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రహ్లాద, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.