కర్నూల్

గాలివాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, మే 27: మండలంలో గాలి వాన బీభత్సానికి వందల ఎకరాల్లో అరటి పంట నష్టపోగా, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు భారీగా నేలవాలాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు వీచిన ఈదురు గాలులకు భారీ వర్షానికి తిమ్మాపురం, కృష్ణనంది, అల్లీనగరం, శ్రీనగరం, గాజులపల్లె, మహానంది ప్రాంతాల్లో ఉన్న అరటి పంట నేలవాలింది. కృష్ణనంది ఏరియాలో భారీగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పడిపోయాయి. అల్లీనగరం సమీపంలో విద్యుత్ స్తంబాలు నేలవాలడంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అసలే అరటి పంటకు ధరలు లేక రైతులు నష్టపోతుంటే గాలి దేవుడు కూడా తన ప్రతాపాన్ని రైతులపై చూపుతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందక ఉద్యానవన పంట రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటు పండించిన పంట చేతికి రాక, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందక రైతులు పడే కష్టం వర్ణణాతీతం. ఇప్పటికైనా ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
రుద్రవరంలో..
రుద్రవరం : రుద్రవరంలో గురువారం రాత్రి గాలివాన బీభత్సా నికి రుద్రవరంతోపాటు 15 గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు, పూరి గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. చిన్నకంబలూరు, కొండమాయపల్లె, వెలగలపల్లె గ్రామాల పరిధిలో మూడు ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు 90 విద్యుత్ స్తంభాలు నేల వాలాయి. 13.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షానికి భీకర గాలి తోడు కావడంతో పూరి గుడిసెల పైకప్పులు వృక్షాలతోపాటు చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో రుద్రవరం సబ్‌స్టేషన్ పరిధిలోని 15 గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. దీంతో గ్రామాల్లోని ప్రజలు తాగునీటికి అవస్తలు పడాల్సి వచ్చింది. కాగా గాలివాన భీభత్సవానికి విద్యుత్ శాఖకు రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్లు ఇన్‌చార్జి ఎఇ షాజహాన్ తెలిపారు. అంధకారంలో ఉన్న గ్రామాలకు శుక్రవారం సాయంత్రం, శనివారాల్లో విద్యుత్‌ను పునరుద్దరిస్తామని తెలిపారు.