కర్నూల్

సిద్దేశ్వరం అలుగుకు నేడు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 30:రాయలసీమ భవిష్యత్తు కోసం ఎంతో ప్రాధాన్యత ఉన్న సిద్దేశ్వరం అలుగు నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేయడానికి రంగం సిద్ధం చేశారు. రాయలసీమ రైతు సంఘం, సిద్దేశ్వరం అలుగు సాధన సమితి, రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో సిద్దేశ్వరం అలుగు నిర్మాణం పూర్తి చేసి తీరుతామని రైతు లు ధీమాతో ఉన్నారు. ఆంగ్లేయుల కాలం నుంచి రాయలసీమ రైతులను ఊరిస్తున్న సిద్దేశ్వరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర అవతరణతో శ్రీశైలం తరలించి రాయలసీమకు తీరని అన్యాయం చేశారని రైతులు మండిపడుతున్నారు. కృష్ణా, తుంగభద్ర జలాల్లో రాయలసీమకు దక్కాల్సిన వాటా నీటిని దిగువకు తరలించుకుపోయి తాగడానికి కూడా నీరు లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. సాగు, తాగునీటిలో రాయలసీమకు న్యాయం జరగాలంటే సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ఒక్కటే మార్గమని వెల్లడిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 864 అడుగుల స్థాయిలో సిద్దేశ్వరం అలుగు నిర్మిస్తే 50 టిఎంసిల నీటిని నిల్వ చేసుకుని రాయలసీమ అవసరాలకు వినియోగించుకోవచ్చని సాగునీటి రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. అలుగు ప్రాధాన్యతను గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సర్వే పనులకు ఆదేశించారు. సర్వే పూర్తయి ప్రభుత్వానికి నివేదిక అందినా నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో ఆగ్రహం తెప్పించింది. కాగా రాష్ట్ర విభజన అనంతరం సిఎం చంద్రబాబు సిద్దేశ్వరం అలుగు నిర్మాణంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని పలు దఫాలు బహిరంగ సభల్లో ప్రజలకు హామీ ఇచ్చినా ఇంత వరకూ ఎలాంటి ముందడుగు వేయలేదు. దాంతో తామే అలుగు నిర్మించుకుంటామని తేల్చి చెప్పిన రైతులు సప్తనదుల సంగమేశ్వరం వద్ద శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. సుమారు 25వేల మంది రైతులను సమీకరించి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వంలో చైతన్యం, స్పందన తీసుకువస్తామని రైతు సంఘం ప్రతినిధులు భూమన్, బొజ్జా దశరథరామిరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిర్మాణ పనులను కొనసాగిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు.