కర్నూల్

బైరెడ్డిపై కోపం మాపై చూపితే ఎలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 30:రాయలసీమ సమస్యలపై గళమెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డిపై ఉన్న కోపాన్ని ప్రభుత్వం తమపై చూపితే ఎలా అంటూ పుష్కర పనులకు నోచుకోని కృష్ణా తీర గ్రామాల ప్రజలు సోమవారం నల్ల జెండాలతో నిరసన తెలిపారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలంలో ఉన్న పాత ముచ్చుమర్రి, కొత్త ముచ్చుమర్రి, కొత్త ఎల్లాల, కొత్త వనుములపాడు గ్రామాలకు కృష్ణా పుష్కరాల నిధులు మంజూరు చేయలేదు. ఈ నాలుగు గ్రామాలు కూడా శ్రీశైలం జలాశయానికి అత్యంత సమీపంలో ఉన్నవే కాకుండా అన్ని గ్రామాల్లోనూ పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా పాత ముచ్చుమర్రి గ్రామంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయం అత్యంత పురాతనమైనదే కాకుండా వందల మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. ఈ నాలుగు గ్రామాల్లో కృష్ణా పుష్కరాల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పుష్కర పనుల కోసం ప్రభుత్వం రూ. 240 కోట్లు మంజూ రు చేసింది. కృష్ణా నదితో ఎలాంటి సంబంధం లేకపోయినా కృష్ణా జలాలు ప్రవహించే గ్రామాల్లో సైతం పుష్కర ఘాట్ల నిర్మాణం, ఆలయాల జీర్ణోద్ధరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే కృష్ణా నదీ తీరంలో ఉన్న ఆ 4 గ్రామాల్లో ఎలాంటి పనులు చేపట్టకపోగా అధికార పార్టీకి పట్టు ఉన్న కృష్ణా నదికి దూరంగా ఉన్న గ్రామాల్లో అవసరం లేకపోయినా నిధులు మంజూరు చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తక్షణం తమ గ్రామాలకు పుష్కర నిధులు కేటాయించి పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల నిరసనకు ఆర్పీఎస్ మద్దతు
పుష్కర నిధులు కేటాయించనందుకు నిరసన తెలిపిన ప్రజలకు ఆర్పీఎస్ మద్దతు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రభు త్వ తీరుపై మండిపడ్డారు. కృష్ణా పుష్కరాల కోసం గుంటూరు, కృష్ణా జిల్లాలకు రూ. వెయ్యి కోట్లు మం జూరు చేసి కర్నూలు జిల్లాకు కేవలం రూ. 240 కోట్లు ఇవ్వడం పక్షపాత ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు. జిల్లాలో పుష్కరాలకు ఎలాంటి సంబంధం లేని గ్రామాలకు సైతం నిధులు మంజూరు చేసి కేవలం తనకు పట్టు ఉన్న కారణం గా ఆ 4 గ్రామాలకు నిధులు ఇవ్వకపోవడం సరైన సబబు కాదన్నారు. రాయలసీమపై, ప్రతిపక్ష పార్టీలపై అధికార పార్టీ, ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు.