కర్నూల్

మండ్లెం చెరువును పరిశీలించిన జెడ్పీ చైర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూపాడుబంగ్లా, జూన్ 7:మండల పరిధిలోని మండ్లెం చెరువును మంగళవారం జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లుగా వర్షలు లేని కారణంగా చెరువు కట్ట పూర్తిగా ఎండిపోవడం వల్లనే చెరువుకు గండిపడి ఉండవచ్చన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. మాండ్ర మాట్లాడుతూ మండ్లెం చెరువు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉందని 1000 ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందిస్తుందన్నారు. దీనికి తోడు చుట్టుపక్కల ఉన్న బావులు, బోర్లలో భూగర్భ జలాలు అభివృద్ధి చెంది పంట పొలాలకు నీరు అందిస్తుందన్నారు. మండ్లెం, తంగెడంచ చెరువులకు మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా నీటి సరఫరా చేస్తామన్నారు. అలాగే పారుమంచాల చెరువును కెసి కాలువ ద్వారా వచ్చే నీటితో నింపుతామన్నారు. జెడ్పీ చైర్మన్ వెంట పలువురు టిడిపి నాయకులు ఉన్నారు.