కర్నూల్

నేడు మహా సంకల్ప దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూన్ 7:నవ నిర్మాణ దీక్షలో భాగంగా బుధవారం నిర్వహించనున్న మహా సంకల్ప దీక్ష కార్యక్రమంపై మండల నోడల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ నిర్వహించనున్న మహా సంకల్ప కార్యక్రమాలపై మంగళవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 14 నియోజక వర్గాల్లో నిర్వహించే నవ నిర్మాణ దీక్ష మహా సంకల్పానికి సంబంధిత మండల నోడల్ అధికారులు తప్పకుండా హాజరు కా వాలన్నారు. ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకూ చేపట్టిన అంశాలపై సమగ్రంగా చర్చించి నివేదికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వ్యవసాయ పంట ఉత్పత్తులు, భూసార పరీక్షలు, పాడిపరిశ్రమ కింద ఎన్ని గ్రామాల్లో డెయిరీ యూనిట్ల గుర్తింపు, ఏయే గ్రామాల్లో పంట నీటి కుంటలు తవ్వాలి, ఏయే ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాలు అవసరం, ఎన్ని గ్రామాలకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కావాలి, తదితర అంశాలపై చర్చించాలన్నారు. రైతులు డ్రిప్ సౌకర్యం వినియోగించుకుంటూ తక్కువ నీటితో అధిక ఉత్పత్తులను సాధించే దిశగా వారిని ప్రోత్సహించాలన్నారు. సాధారణ పంటల స్థానంలో ఉద్యానవన పంటలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుందని తెలియజేయాలన్నారు. 2019 అక్టోబర్ నాటికి జిల్లాలోని అన్ని గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరికిరణ్, సిపిఓ ఆనంద్‌నాయక్ పాల్గొన్నారు.