కరీంనగర్

కాల్వల ఆధునీకరణకు 200 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, జూన్ 9: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు భూములకు సాగు నీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, కాల్వల ఆధునీకరణ పనుల కోసం 200 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పెద్దపల్లి, మంథని నియోజక వర్గం పరిధిలోని ఎస్సారెస్పీ డి-83, డి-86 కాల్వలను చూడటానికి గురువారం వచ్చిన మంత్రి పెద్దపల్లి మండల పరిషత్ సమావేశ మందరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి మూడు దశాబ్ధాలు అవుతున్నా ఇప్పటి వరకు డి-83, డి-86 కాల్వల ద్వారా చివరి ఆయకట్టు భూములకు నీరు అంద లేదని ఆయన పేర్కోన్నారు. ఎస్సారెస్పీ ద్వారా సాగు నీటి సౌకర్యం ఉన్నా, నీరు సరఫరా కాకపోవడం వల్ల ఇప్పటికీ వ్యవసాయ బావులు, బోరు బావులు, చెరువులు, కుంటల ఆధారంగా రైతులు పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. అందుకే కాల్వల ఆధునీకరణ పనుల కోసం ఎస్సారెస్పీ అధికారులు రెండు కోట్లు కావాలని కోరితే, తాను 200 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. డి-83, డి-86 కాల్వల ద్వారా 2850 క్యూసెక్కుల నీరు సరఫరా సామర్థ్యం ఉన్నా, చివరి భూములకు నీరు అందడం లేదని, వేయి క్యూసెక్కుల నీరు విడుదల చేసిన పూర్తి స్థాయిలో నీరు సరఫరా జరడం లేదని తెలిపారు. అందుకే కాల్వల సామర్ధ్యాన్ని పెంచి కాల్వ చివరి ఆయకట్టు భూములకు నీరు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు ఆయన పేర్కోన్నారు. అవసరమైతే ఎల్లంపల్లి జలాశయం నుంచి నీటి సరఫరా చేసి సాగు నీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం కోసం తగిన నిధులు కేటాయించామని, భవిష్యత్తులో సాగు, తాగు నీరు కొరత లేకుండా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ డి-83, డి-86 కాల్వల ద్వారా చివరి ఆయకట్టు భూములు కలిగిన కాల్వశ్రీరాంపూర్, ఓదెల, పెద్దపల్లి మండలాలకు సాగు నీరందడం లేదని, దీనితో కాల్వలపై ఆధార పడిన రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారని మంత్రి ఈటల దృష్టికి తీసుకెళ్లారు. ఈసమావేశంలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, ఎస్సారెస్పీ సిఇ శంకరయ్య, ఆర్డీవో సి.నారాయణరెడ్డి, ఎంపిపి సందనవేన సునీత, తహశీల్దార్ అనుపమరావు, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.