కర్నూల్

ఉద్యోగుల బదిలీల్లో పైరవీలకు తావివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, జూన్ 14 : ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో పైరవీలకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, కాగిత రహిత పాలన, ఈ-ఆఫీసు అంశాలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చాలా ఏళ్లుగా ఒకే స్థానంలో విధులు నిర్వహిస్తున్న వారిని తప్పకుండా బదిలీ చేయలన్నారు. ఉద్యోగుల బదిలీ అంశాన్ని సిఎం చంద్రబాబు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రతి అధికారి తమ పరిధిలోని ఉద్యోగుల సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచాలన్నారు. జీఓ మార్గదర్శకాలను తప్పక పాటిస్తూ నైపుణ్యతను పరిగణలోకి తీసుకుని సమర్థవంతంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలన్నారు. ఈ నెల 15వ తేదీ లోగా ఉద్యోగుల సమాచారాన్ని తయారు చేసుకుని రావాలన్నారు. జూన్ 2017లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ నుంచి మినహాయించాలన్నారు. ఇక ప్రభు త్వం కాగిత రహిత పాలనకు శ్రీకారం చుట్టిందని, ప్రతి కార్యాలయం జూన్ ఆఖరు నాటికి ఈ-ఆఫీసులో నమోదై ఈ-ఆఫీసు ద్వారానే కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో జెసి హరికిరణ్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.