కర్నూల్

పడకండ్లలో వైభవంగా చెన్నకేశవుని కల్యాణోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, జూన్ 17: నగర పంచాయతీ పరిధిలోని పడకండ్ల గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవుని కల్యాణోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ముందుగా ఆలయంలో వెలసిన మూలమూర్తి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవునికి పంచామృతాభిషేకం చేశారు. సాయంత్రం వందలాది భక్తులు వీక్షిస్తుండగా ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామిలను ప్రత్యేకంగా అలంకరించి ఎదరుకోళ్ల తంతు నిర్వహించి వరపూజ చేశారు. రాత్రి ఉత్సవమూర్తులకు ఆలయంలోని కొలువు మండపంలో కొలువుంచి భాజాభజంత్రీల మంగళవాయిద్యాల నడుమ అర్చకులు వేదమంత్రాల నడుమ నాందీ, స్ర్తి, పురుషసూక్తాలను పఠించి జీలకర్రా, బెల్లం, కంకణధారణలను గావించారు. భక్తులు కల్యాణోత్సవం తిలకిస్తుండగా అర్చకులు మాంగళ్యధారణ చేశారు. స్వామి, అమ్మవార్ల పాదాల వద్ద అర్చకులు ముత్యాల తలంబ్రాలను పోశా రు. అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలను అందజేశారు. చివరగా ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కల్యాణం జరిగిన స్వామి వారు గ్రామంలో ఊరేగిస్తే ఆ గ్రామం సుభిక్షంగా వుంటుందని పురాణాలు చెబుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.