కర్నూల్

వ్యవసాయ ఉత్పాదకతలపై తప్పుడు సమాచారమిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 17:జిల్లాలో వ్యవసాయ ఉత్పదకతకు సంబంధించి ఉహాజనిత సమాచారం ఇస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ విజయమోహన్ వ్యవసాయ శాఖ అధికారులు, ఎంపిఓలను హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో శుక్రవారం కర్నూలు డివిజన్‌కు సంబంధించిన ప్రధాన పంటల యాక్షన్‌ప్లాన్‌పై కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల వారీగా క్షేత్రస్థాయి లో ప్రధాన పంటల యాక్షన్ ప్లాన్, ఎంతమంది రైతులున్నారు, ఎంత హెక్టార్ల భూమి ఉంది, ఎన్ని ఎకరాల భూమి లో భూసార పరీక్షలు చేశారు, ఎంతమందికి ఫారంపాండ్లు, బోరువెల్ రీచార్జి స్ట్రక్చర్స్ మంజూరు చేశారు, ఎన్ని గ్రేడింగ్ అయ్యాయి, ఎన్ని పురోగతిలో ఉన్నాయి, ఎన్ని పూర్తి చేశారు, తదితర వివరాలు పక్కాగా ఇవ్వాలన్నారు. అలాకాకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయ ఉత్పదకతపై ఉహాజనిత నివేదిక ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపిఓలు, వ్యవసాయ శాఖ అధికారులను హెచ్చరించారు. అలాగే గత ఏడాది ఖరీఫ్‌లో పంటల దిగుబడి, ఈ ఏడాది ఏయే ప్రధాన పంటల ఉత్పత్తి ఎంత మాత్రం పెంచదలచుకున్నారు, తదితర వివరాలు కావాలన్నారు. అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు మరోసారి సమీక్షిస్తానని, వ్యవసాయ యాంత్రీకరణపై పక్కా సమాచారంతో రావాలని కలెక్టర్, వ్యవసాయ, ఆత్మ ప్రాజెక్టు, ఎంపిఓలను ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డిడి ఉమామహేశ్వరమ్మ పాల్గొన్నారు.