కర్నూల్

గిరిజనులను ఆదుకుంటాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూన్ 17:గిరిజనులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత భరోసా ఇచ్చారు. మండల పరిధిలోని బైల్లూటి చెంచుగూడెంలో శుక్రవారం మంత్రి సునీత చెంచులకు అంత్యోదయ అన్న యోజ న కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో అంతరించిపోతున్న జాతుల్లో చెంచు జాతి ఒకటన్నారు. వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ముఖ్యం గా చెంచులు ఎవ్వరూ ఆకలితో అలమటించకూడదనే సిఎం చంద్రబాబు అంత్యోదయ అన్న యోజన పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. గూడెంలో ఉన్న ప్రతి కుంటుంబానికి అంత్యోదయ అన్న యోజన కార్డులు ఇస్తామన్నారు. గిరిజనులు చిన్నతనంలోనే ఆడపిల్లలకు వివాహం చేస్తున్నారని, ఇక ఆ సంప్రదాయానికి స్వస్థి పలికి బాలికలను చదివించాలన్నారు. ప్రభుత్వం ప్రతి చెంచు కుంటుంబానికి ఒక ఇల్లు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఏర్పాటు చేస్తుందన్నారు. అలాగే దీపం పథకం కింద వంట గ్యాస్ పంపిణీ చేస్తామన్నారు. ఇక ప్రతి నిరుపేద కుటుంబం సంతోషంగా పండుగలు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సంక్రాంతి చంద్రన్న కానుక, రంజాన్ తోఫా వంటి పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 2.09 లక్షల కుటుంబాలకు జూలై 1 నుంచి 15వ తేదీ వరకూ రంజాన్ తోఫా కిట్లు ఇస్తారని రేషన్‌కార్డు కలిగిన ముస్లిం కుటుంబాలు వాటిని పొందాలని సూచించారు.
చెంచుల నిధులు దుర్వినియోగం:ఎమ్మెల్సీ శిల్పా
చెంచుల అభివృద్ధి కోసం మంజూరైన రూ. కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని వారిని చూస్తే తెలిసిపోతుందని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. చెంచుల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జిల్లాలో ఉన్న గూడెంలకు వెళ్లడానికి రహదారులు కూడా లేవన్నారు. చెంచుల తాగునీటి సమస్య తీర్చడానికి బోర్లు వేద్దామన్నా, రహదారులు ఏర్పాటు చేస్తామన్నా అటవీ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధనలు చెంచుల అభివృద్ధికి పెద్ద ఆటంకంగా మారాయన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా సంక్రమించిన భూముల్లో గిరిజనులు వ్యవసాయం చేసేకునేందుకు వీలున్నా అటవీశాఖ అధికారులు వారిని అడవిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్నారు. చెంచుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా వారు ఎందుకు అభివృద్ధి చెందడం లేదని ప్రశ్నించారు. వారి అభివృద్ధికి వచ్చిన నిధులను అధికారులు దుర్వినియోగం చేశారన్నారు. రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులతో కలిసి ఆ నిధులు ఎక్కడకు వెళ్లాయో విచారణ చేపట్టాలన్నారు.
చెంచులను నాగరిక ప్రపంచంలోకి తీసుకొద్దాం:ఎమ్మెల్యే బుడ్డా
చెంచులను నాగరిక ప్రపంచంలోకి తీసుకొద్దామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజన గూడెంలు ఉన్నాయని, వారికి విద్యనందిస్తే సభ్య సమాజంలో కలిసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. కాగా సిఎం చంద్రబాబు రాష్ట్రం కోసం విశేషంగా కష్టపడుతున్నారని ఆయనతో కలిసి నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పాలు పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో టిడిపిలో చేరానని వివరించారు. కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ జిల్లాలోని 14 మండలాల్లో 44 చెంచుగూడెంలు ఉన్నాయని, దాదాపు 3,020 చెంచుల కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. అందులో 1,849 కుటుంబాలకు ఎఎవై కార్డులు ఉన్నాయన్నారు. అంత్యోదయ అన్న యోజన కార్డు ద్వారా ప్రభుత్వం ప్రతి కుంటుంబానికి 35 కిలోల బియ్యం ఇస్తుందన్నారు. చెంచుల సమస్యలను 3 నెలల్లోపు పరిష్కరించడానికి ప్రయత్నిస్తామన్నారు.