కర్నూల్

నేత్రదానానికి అంగీకరిస్తే రౌడీషీట్ ఎత్తివేత:సిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, జూన్ 23:బనగానపల్లె పోలీస్‌స్టేషన్ సర్కిల్ పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత కలిగిన వారు నేత్రదానం చేసేందుకు ముందుకు రావడంతో పాటు భవిష్యత్తులో సత్ప్రవర్తనతో మెలిగితే వారిపై వున్న రౌడీషీట్ ఎత్తివేస్తామని సిఐ శ్రీనివాసులు స్పష్టం చేశారు. సిఐ శ్రీనివాసులు గురువారం సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లు, నేరచరితులను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి నేత్రదానంపై అవగాహన కల్పించారు. దీంతో బనగానపల్లె స్టేషన్ పరిధిలో 40 మంది, అవుకు స్టేషన్ పరిధిలో 20 మంది నేరచరితులు నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు వారి చేత సిఐ నేత్రదాన ఆమోద పత్రాలపై సంతకం చేయించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఎస్పీ ఆదేశాల మేరకు తాము నేరచరితులను నేత్రదానం చేసేందు ఒప్పించగలిగామన్నారు. దీనివల్ల నేరచరితుల్లో మార్పు వచ్చి వారు మంచిమార్గంలో నడిచే అవకాశం వుంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు రాకేష్, విజయలక్ష్మి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.