కర్నూల్

హజ్‌యాత్రలో ఏపి కోటా పెంపునకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, ఏప్రిల్ 10: ముస్లింలకు అత్యంత పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్ళే వారి కోసం ఆంధ్రప్రదేశ్ కోటాను మరింతగా పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధృష్టికి తీసుకెళ్ళి సాదిస్తామని రాష్ట్ర ప్రభుత్వ హజ్ కమిటీ సభ్యులు ఉస్మాన్‌సాబ్ పేర్కొన్నారు. ఆదివారం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆయనను టిడిపి పార్టీ నాయకులు, పట్టణానికి చెందిన ముస్లింమైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో రాష్ట్రానికి కేవలం 2వేల మంది హజ్ యాత్రకు వెళ్ళేందుకు కోటా ఉందని అయితే దరఖాస్తులు మాత్రం వేలలో వస్తున్నాయన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1859 మందిని డిప్ సిస్టం ద్వారా ఎంపిక చేశామన్నా రు. కర్నూలు జిల్లా నుంచి 777 మంది హజ్‌యాత్ర కోసం దరఖాస్తు చేసుకోగా మొదటి విడుతగా 136 మందిని ఇటీవల ఎంపిక చేశామన్నారు. కోటా తక్కువగా ఉండడంతో హజ్ యాత్రకు వెళ్లేవారికి ఎక్కువగా అవకాశం లేకుండా తగ్గాయని పేర్కొన్నారు. త్వరలోనే కడపలో నిర్మిస్తున్న హజ్‌హౌస్‌ను ప్రారంభిస్తున్నారని అక్కడ నుండే హజ్ యాత్రకు వెళ్ళేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. తనను రాష్ట్ర స్థాయి కమిటీకి ఎంపిక చేసిన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతినాయుడు, మార్కెట్‌యార్డు చైర్మన్ భాస్కర్‌రెడ్డి, వైస్ చైర్మన్ రామస్వామి, ఎల్లెల్సీ డిసి వైస్ చైర్మన్ రామస్వామి, గోపాల్‌రెడ్డి, ఆత్మచైర్మన్ ఫకృద్దీన్, మైనార్టీ యూత్‌నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.