కర్నూల్

ఆర్యవైశ్య మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, జూన్ 24:ఆర్యవైశ్య మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు, జిల్లా సంఘం అధ్యక్షుడు పత్తి సర్వేశ్వర ప్రసాద్, ఆర్యవైశ్య ప్రముఖ నేత, సంజామల మండల సహకార సంఘం అధ్యక్షుడు పెండేకంటి కిరణ్‌కుమార్‌లు పేర్కొన్నారు. శుక్రవారం బనగానపల్లె పట్టణంలోని శ్రీ వాసవీ అమ్మవారి శాలలో జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలుగా నూకల వాసంతి, ప్రధాన కార్యదర్శిగా బింగిమళ్ల లక్ష్మిదేవి, కోశాధికారిగా నూకల మహాలక్ష్మిలతో పాటు ఉపాధ్యక్ష, కార్యదర్శి, కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం రాష్ట్ర అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు చేయించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య నేత లు మాట్లాడుతూ ఆర్యవైశ్య మహిళా సంఘం సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టి మంచిపేరు తీసుకురావాలన్నారు. జిల్లాలో 30 మండలాల్లోనే ఆర్యవైశ్య సంఘం ఏర్పాటైందని జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. విద్య, ఉద్యోగా, ఇతరత్ర వాటిలో ప్రభుత్వం 50 శాతం మహిళలకు కేటాయిస్తుందని ఆర్యవైశ్య మహిళలు రాజకీయంగా కూడా రాణించాలని, ఉన్నత పదవులు పొం దాలని వారు ఆకాంక్షించారు. ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రధాన పదవులు బనగానపల్లెకు చెందిన వారికే లభించడం అదృష్టంగా చెప్పారు. ఆర్యవైశ్య సంఘానికి 125 సంవత్సరాల ఘన చరిత్రవుందని అనేక పదవులు, సేవా కార్యక్రమాలు దశాబ్దాల తరబడి అందిస్తూ వస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు తమ వం తు సహకారం అందిస్తామని ఆర్యవైశ్య సంఘాలు నేతలు కృషితో ఉన్నత పదవులు పొందాలని సూచించారు. ఆర్యవైశ్యులు ఐక్యంగా వుండి సమస్యలు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టంగటూరు శీనయ్య, ఆర్యవైశ్య ముఖ్యనేతలు నూకల విజయకుమార్, నాగేంద్ర రాజగోపాల్, రఘు, పాండురంగయ్య, వెంకటశెట్టి, బింగిమళ్ల సత్యంశెట్టి, జంగంశెట్టి, వేణుగోపాల్, గుండా శ్రీనివాసులు, నాగరాజు, డి వెంకటసుబ్బయ్య, అధిసంఖ్యలో ఆర్యవైశ్య సోదరులతో పాటు మహిళలు కూడా జిల్లా వ్యాప్తంగా తరలివచ్చారు.
రాఘవేంద్రుని సన్నిధిలో ప్రముఖులు
మంత్రాలయం, జూన్ 24: పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం శుక్రవారం కర్నాటక మాజీ డిప్యూటీ సిఎం ఈశ్వరప్ప, బెంగళూరు కెపిసిఎల్ ఎండి జి కుమార్ నాయక్ వేరువేరుగా వచ్చారు. వారికి మఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహమూర్తి ఏనుగుతో మాల వేసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. వారు ముందుగా గ్రామదేవత మంచాలమ్మరు దర్శించుకుని అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు శేషవస్త్రం, ఫల మంత్రాక్షింతలు జ్ఞాపికను ఇచ్చి ఆశీర్వదించారు.
అత్యాచారం కేసులో
ముగ్గురు నిందితుల అరెస్టు
* రౌడీషీట్ తెరవాలి * ఎస్పీ ఆకే రవికృష్ణ
కర్నూలు, జూన్ 24:కర్నూలు మం డలం ఇ.తాండ్రపాడు గ్రామానికి చెం దిన మహిళపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ చె ప్పారు. శుక్రవారం జిల్లా పోలీసు కా ర్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియం లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ నింధుతులైన బాలరాజు, దుబ్బక్రిష్ణ, కుమార్‌ల ను అరెస్టు చేశామన్నారు. అత్యాచారం విషయం గ్రామంలో తెలియడంతో ముగ్గురు నిందుతులు పారిపోగా మ హిళ కూడ తన భర్తకు విషయం తెలుస్తుందని భయపడి వెళ్ళి పోయి బంధువుల ఇంట్లో తలదాచుకుందన్నా రు. భర్త తన భార్య కోసం గాలించి కనపడటం లేదని కర్నూలు తాలుక పోలీసులకు ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె కో సం గాలించగా మహిళ బంధువుల ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని ఆమెను పిలిపించి విచారించగా పోలీసుల సమక్షంలో నింధుతులు బలవంతం గా అత్యాచారం చేశారని బాధితురాలు వెల్లండించింది. మహిళలపై దాడులకు పాల్పడితే నిందుతులపై రౌడీషీట్‌లు తెరుస్తామన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే నిందితులపై డిఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. కోర్టులో త్వరితగతిన చార్ట్‌షీట్, ట్రయల్ త్వరితగతిన పూర్తి చేసి నిందితులకు కఠిమైన జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. కర్నూలు డిఎస్పీ రమణమూర్తి, తా లుకా సిఐ మహేశ్వరెడ్డి పాల్గొన్నారు.
రైతులకు రుణమాఫీ పత్రాలు అందజేత
నందికొట్కూరు, జూన్ 24 : వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పు లు తెచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అన్నారు. శుక్రవారం మండలంలోని వడ్డెమాను గ్రామంలో నిర్వహించిన సమావేశంలో రైతులకు రుణమాఫీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతులకు విడతల వారీగా రుణమాఫీ చేస్తున్నామన్నారు. అంతకుముందుగా జెడ్‌పి చైర్మన్ రాజశేఖర్, ఎంపిపి వీరం ప్రసాదరెడ్డిలు 10.బొల్లవరం గ్రామంలో, నందికొట్కూరు మండలాభివృద్ధి కార్యాలయంలో, అల్లూరు గ్రామంలో, వడ్డెమాను గ్రామంలో మొక్కలు నాటారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని వారు కోరారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి చింతకుంట లక్ష్మిదేవి, సర్పంచ్ ద్వారం అనురాధ, తహశీల్దార్ రమణారావు, ఎంపిడిఓ ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గుత్తేదార్లపై చర్యకు డిమాండ్
కర్నూలు ఓల్డ్‌సిటీ, జూన్ 24:జిల్లాల పుష్కరాలకు సంబంధించి స్నానఘటాల నిర్మాణం, సిసి రోడ్లు నిర్మాణంలో నాణ్యత పాటించిన గుత్తేదార్లపై, ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపియం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. కోట్టాది రూపాయ ప్రజాధనం పుష్కర పనుల పేరుతో అధికార పార్టీ నాయకులు, గుత్తేదార్లు, ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కై దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. శ్రీశైలం పుష్కర ఘాట్ల నిర్మాణంలోగాని, లక్ష్మాపురం నుండి ఘనపురం వరకు వేసిన తారురోడ్డు నాణ్యత గురించి గాని, పగిడ్యాల మండలం ఎల్లంబావి నుండి నెహ్రునగర్ వరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణంలో, నంద్యాల-నందికోట్కూరు రోడ్డు పనుల్లో నాసిరకంగా జరుగుతున్నాయని తెలిపారు.