కర్నూల్

బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, జూన్ 26 : ఎంపిక చేసిన గ్రామా పంచాయతీల్లో బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సిఆర్‌పిలు ప్రత్యేక కృషి చేయాలని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆదివా రం సిఆర్‌పిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపిక చేసిన గ్రామలకు ఇద్దరు సిఆర్‌పిల చొప్పున పంపిస్తున్నామని, వారికి గ్రామైక్య సంఘం సభ్యులు సహకారం అందిస్తారని తెలిపారు. సిఆర్‌పిలు ఇంటింటికీ వెళ్లి మరుగుదొడ్డి ఆవశ్యకతను వివరించాలన్నారు. పాఠశాల విద్యార్థులతో దీనిపై ర్యాలీ నిర్వహించాలని తెలిపారు. మహిళా సంఘాలను కలుపుకొని వ్యక్తిగత మరుగుడొడ్ల నిర్మాణంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో డ్వామా పిడి పుల్లారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.