కర్నూల్

రైతులకు రుణవిముక్తి కల్పించిన ఘనత టిడిపిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, జూన్ 28:రుణమాఫీ అమలు చేసి రైతులను రుణాల నుంచి విముక్తులను చేసిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఇల్లూరు కొత్తపేట గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే రైతులకు రుణ ఉపశమన పత్రాలు పంపిణీ చేశారు. అందులో భాగంగా ఇల్లూరు కొత్తపేట రైతులకు రూ. 47 లక్షలు, గులాంనబీపేట రైతులకు రూ. 11 లక్షలు రుణమాఫీ చేస్తూ వాటికి సంబంధించిన ఉపశమన పత్రాలను ఎమ్మెల్యే రైతులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బిసి మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ చేశామని అయితే ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో సిఎం చంద్రబాబు 5 దఫాలుగా రుణమాఫీ చేస్తున్నారన్నారు. రైతులు కూడా సహకరించిన ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సిఎం రైతు అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని, ముఖ్యంగా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండడంతో పాటు వాటి పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించి వీధుల్లో వర్షం నీరు నిలిచి బురదమయమై నడవడానికి వీలులేని విధంగా వుండడాన్ని గమనించారు. ఈ విషయమై వెంటనే సర్పంచ్ రామిరెడ్డి, గ్రామస్తులతో మాట్లాడారు. అలాగే గ్రామంలో సిమెంటు రోడ్ల నిర్మాణానికి రూ. 60 లక్షలు, గ్రామ సచివాలయ నిర్మాణానికి రూ. 15 లక్షలు కేటాయించి వాటి పనులు త్వరగా ప్రారంభించేందుకు ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడతామన్నారు. అంతర్గత విభేదాలతో గ్రామంలో అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అనంతరం పాఠశాల వద్ద ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మంచి బోధన చేయాలని సూచించారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని ఇందుకు సార్థకత చేకూర్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై వుందన్నారు. గ్రామంలో వున్న ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించి సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. వైద్య సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించాలని, ప్రస్తుత వర్షాకాలంలో వ్యాధులు ప్రభలే అవకాశం వుందని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని ప్రజలకు వైద్యసేవలు అందించాలన్నారు. విధులకు గైర్హాజరు కారాదని, సమస్యలు తెలిపితే వాటి పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. ఎమ్మెల్యే వెంట మండల వ్యవసాయాధికారి సి.సుబ్బారెడ్డి, ఎంపిడిఓ పి.బాలకృష్ణారెడ్డి, తహశీల్దార్ షేక్‌మొహిద్దీన్, సర్పంచ్ రామిరెడ్డి, మాజీ సర్పంచ్ యన్నం వెంకటసుబ్బారెడ్డి, రైతులు ఉన్నారు.