కర్నూల్

రామజలకు పైపులైన్ కోసం రూ. 25 కోట్లతో ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, ఏప్రిల్ 10:తుంగభద్ర దిగువ కాలువ నుంచి రామజల చెరువుకు పెద్దకడబూరు మండలంలోని నెమిలికల్ నుంచి ప్రత్యేకంగా పైపులైన్ నిర్మాణానికి రూ. 25 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధ్దం చేశామని మంజూరు కోసం ప్రభుత్వానికి పంపుతున్నట్లు ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఎల్లెల్సీకి తాగునీటి కోసం విడుదల చేసిన నీరు బసాపురం వద్దకు చేరడంతో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి నీటిని గంగపూజలు చేసి ఎస్‌ఎస్ ట్యాంకులోకి నింపేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన మోటార్లను ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లెల్సీ కాలువ బసాపురం వద్ద నుంచి రామజలకు పైపులైన్ శిథిలావస్థలో ఉందని కొత్తగా వేయాలన్న పట్టణం నుంచి తీసుకెళ్లేందుకు ఇబ్బందులు వస్తున్నాయని అందువల్ల పెద్దకడబూరు మండలం నుంచి నెమిలికల్లు నుంచి నేరుగా రామజలకు పైపులైన్ రూ. 25కోట్లతో ప్రత్యేకంగా వేసేందుకు అన్ని విధాగాలుగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రస్థుతం బసాపురం ఎస్‌ఎస్ ట్యాంకు లో 1400మిలియన్ లీటర్ల తాగునీరు నిలువ ఉన్నాయని కాలువలో 10 రోజులపాటు నీరు ప్రవహిస్తాయని అందువలో 1000 మిలియన్ నీటిని నిలువ చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్థుతం కొత్తగా మూడు మోటర్లను రూ. 7లక్షలతో ఏర్పాటు చేస్తున్నారని అదనంగా మరో మూడు మోటర్లు ఏర్పాటు చేసి నీటిని నిలువ చేయాలని ఎమ్మెల్యే అదికారులను ఆదేశించారు. అలాగే నీటి లీకేజీలను అరికట్టాలని ఫిల్టర్ బెడ్ల నుంచి ప్రతి సారి 10లక్షల లీటర్ల నీరు వృధా అవుతుందని దాని కోసం ప్రత్యేకంగా సంపు నిలువ చేసి తిరిగి ఎస్ ఎస్ ట్యాంకులో పంపింగ్ చేయాలని సూచించారు. బసాపురం ఎస్ ఎస్ ట్యాంకు చూట్టు మున్సిపాలిటి స్థలం ఎంత వరకు ఉంది అనే విషయంపై సర్వే నిర్వహించాలని ఆదేశించారు.ఇప్పటికే లీకేజీలను అరికట్టడంతో చాలా వరకు నీటి వృథా తగ్గిపోయిందని పూర్థిస్థాయిలో లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. పట్టణంలోబోర్ల వద్ద మోటర్లు ఏర్పాటు చేసి నీటిని అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్‌ప్రదీప్‌కుమార్, ఏఇ రామమూర్తి, మున్సిపల్ సిబ్బంది, వైకాపా నాయకులు గోపాల్‌రెడ్డి, ఈరన్న, జైపాల్, తదితరులు పాల్గొన్నారు.