కర్నూల్

విద్యార్థులను సరైన దిశలో నడిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు అర్బన్, జూలై 1:కేవలం పాఠం బోధించడమే కాకుండా విద్యార్థిని సరైన దిశలో నడిపించాల్సిన బృహత్తర బాధ్యత అధ్యాపకులపై ఉందని రాయలసీమ యూనివర్శిటీ విసి ఆచార్య వై.నరసింహులు సూచించారు. ఆర్‌యూలో రెండు రోజుల పాటు జరిగే ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని శుక్రవారం విసి ప్రారంభించి, అధ్యాపకులకు వివిధ అంశాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కార్యక్రమం విద్యా సంవత్సరం ప్రారంభంలో నిర్వహించడం సంతోషకరంగా వుందన్నారు. బోధనను కేవలం ఒక వృత్తిగా మాత్రమే చూస్తే దానికి న్యాయం చేయలేరని, త్రికరణశుద్ధిగా పని చేసినప్పుడే విద్యార్థి భవితకు బాటలు వేసివ వారవుతానని ఉద్బోధించారు. చేస్తున్న పనిని మరింత శ్రద్ధగా చేస్తే దేశ నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించినట్లే అని అభిప్రాయపడ్డారు. అలాగే వర్శిటీలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అందుబాటులోకి తీసుకువచ్చిన సాంకేతిక వసతులను అధ్యాపకులకు వివరించారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు పద్మనాభయ్య ‘ఎఫెక్టివ్ టీచింగ్, మైక్రో టీచింగ్’ అంశాలపై దిశానిర్ధేశం గురించి బోధించారు. అంతకుముందు విసి రెండవ అకడమిక్ భవనంలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అమర్‌నాథ్, ప్రిన్సిపాల్ ఆచార్య ఐఇ.చక్రవర్తి, వివిధ శాఖల ఆచార్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.