కర్నూల్

గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతు విలవిల..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 31: జిల్లాలో విస్తారంగా పండించే ఉల్లికి గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఒక ఎకరాలో ఉల్లి పంట పండించడానికి దాదాపు రూ. 50 వేలు ఖర్చు చేస్తున్నారు. అయితే అందులో వచ్చిన పంట దిగుబడిని మార్కెట్‌లో విక్రయిస్తే కనీసం రూ. 5 వేలు కూడా రావడం లేదని ఉల్లి రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి నో లాస్ నో గెయిన్ ప్రకారం క్వింటాల్‌కు రూ. 400 పెట్టి కొనుగోలు చేస్తున్నామని పేర్కొంటున్నా ఆచరణలో అమలు చేయడంలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో లక్ష టన్నుల ఉల్లి దిగుబడి వుందని, అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ కేవలం 10 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. గత ఏడాది ఉల్లికి మద్దతు ధర లేనప్పుడు మార్కెఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి క్వింటాల్‌కు రూ. 1,250 చొప్పున చెల్లించి ఉల్లి రైతులను ఆదుకుంది. ఈ ఏడాది కూడా ప్రభుత్వమే ఉల్లి దిగుబడిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో రైతు పండించిన ఉల్లి పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 700 వస్తే పెట్టిన ఖర్చు వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.