కర్నూల్

సుస్థిర అభివృద్ధి వైపు ఆర్‌యూ అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు అర్బన్, జూలై 4:రాయలసీమ యూనివర్శిటీ ప్రత్యేక ప్రణాళికతో సుస్థిర అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని ఆర్‌యూ వైస్ ఛాన్సలర్ ఆచార్య వై.నరసింహులు పేర్కొన్నారు. వర్శిటీలోని తన ఛాంబర్‌లో మంగళవారం విసి పాత్రికేయుల సమావేశం లో మాట్లాడారు. వర్శిటీలో జరుగుతు న్న అభివృద్ధి పనులను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ప్రత్యేక ప్రయోగశాలలు, లెక్చరర్ హాల్స్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో ప్రత్యే క ప్రయోగశాల, నూతన సెమినార్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే వసతి గృహాలను క్రమబద్ధీకరిస్తూ విద్యార్థులు వుండేందుకు వసతిని పెం చామన్నారు. బాలుర వసతి గృహంలో జూనియర్స్, సీనియర్స్‌కు వేర్వేరుగా ఏర్పాటు చేయడంతో పాటు నూతన ఫర్నిచర్, రిక్రియేషన్ హాల్స్, రీడింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. మహి ళా వసతి గృహంలో వంట గది ఆధునీకరణ, గదుల విస్తీర్ణం తదితర పనులను ఈ నెలలోగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తు తం వర్శిటీలోని గ్రంథాలయంలో 250 ఈ-జర్నల్స్‌ను విద్యార్థులు వైఫై సౌకర్యంతో సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నాల్గవ సెమిస్టర్‌లో అన్ని సబ్జెక్టు ల్లో ప్రాజెక్టులు తప్పనిసరి చేశామన్నా రు. తద్వారా విద్యార్థులు పరిశోధనల పై దృష్టి సారించే అవకాశం వుంటుందన్నారు. ఇతర శాఖల్లో సమానంగా వుం డే సబ్జెక్టులను నిష్ణాతుల చేత బోధించేందుకు మాడ్యులార్ టీచింగ్ ద్వారా బోధన జరుగుతోందన్నారు. ఎంఎస్సీ డేటా సైన్సులో మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, బేసిక్ సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, డేటా అనాలసిస్, మెషిన్ లర్నింగ్, నెట్‌వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ అంశాలపై బోధన జరుగుతుందన్నారు. ఎంఎస్సీ డేటా సైన్స్ భవిష్యత్తులో పరిశోధన, నూతన ఆవిష్కరణలు, బోధనకు దోహదపడుతుందన్నారు. బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహా నగరాలకు చెందిన సాఫ్ట్‌వేర్, బహుళజాతి కంపెనీలతో ఆర్‌యూ ఎంఓయులను కుదుర్చుకుని విద్యా బోధనను చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహకారంతో బిగ్ డేటా అనాలసిస్‌పై రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించి అధ్యాపకుల్లో నైపుణ్యం పెంచేందుకు తర్ఫీదు ఇచ్చామన్నారు. దాదాపు రూ. 1.2 కోట్ల వ్యయంతో సైన్స్ శాఖల్లో ప్రయోగశాలలు, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్, లైబ్రరీలోని పుస్తకాలను కొనుగోలు చేసి బోధనకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఇన్‌ఫర్‌మాటిక్స్ సెంటర్ ద్వారా వర్శిటీ పరిధిలోని యుజి, పిజ కళాశాలల్లో ఈ ఏడాది నుంచి బయోమెట్రిక్ విధానం ప్రవేశపెడుతున్నామన్నారు. విద్యార్థుల హాజరుకు వారి ఆధార్ కార్డుతో అనుసంధానం వుంటుందని దాన్ని వర్శిటీ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ముఖ్యమంత్రి కార్యాలయం వారు పరిశీలిస్తారన్నారు. 75 శాతం హాజరు లేని వారిని పరీక్షలకు అనుమతించకపోవడంతో పాటు స్కాలర్‌షిప్ మంజూరు కాదని స్పష్టం చేశారు. విద్యార్థులు కేవలం తమ పిజి కోర్సుకే పరిమితం కాకుండా అదనపు విద్యార్హత కలిగే వుండి నైపుణ్యాన్ని పెంచేందుకు యాడ్ ఆన్ కోర్సుల కింద సాయంత్రం డిప్లొమా ఇన్ యోగా, డిప్లొమా ఇన్ కమ్యునికేటివ్ ఇంగ్లీష్, డిప్లొమా ఇన్ ఐసిటి, ట్యాలీ కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. విద్యార్థులు కేవలం రూ. 500 వార్షిక ఫీజును చెల్లించి ఈ కోర్సుల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. సెంటర్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఆధ్వర్యంలో విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు నిష్ణాతుల చేత ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో రాయలసీమ యూనివర్శిటీని రాష్ట్రంలోనే ఆద్శంగా తీర్చిద్దిదేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు విసి నరసింహలు తెలిపారు.