కర్నూల్

పాత మిద్దె కూలి కూలీల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, జూలై 8:పొట్టకూటి కోసం ఇంటి నిర్మాణ పనులకు వెళ్లి సేద తీరుతుండగా పక్కనే ఉన్న పాత మిద్దె గోడ కూలి ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందగా, మరో ముగ్గురు కూలీ లు గాయపడిన సంఘటన శుక్రవారం బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో చోటుచేసుకుంది. నందవరం గ్రామానికి చెందిన మహిళలు అదే గ్రామంలో మాజీ ఎంపిటిసి పిఆర్ వెంకటేశ్వరరెడ్డి ఇంటి నిర్మాణ పనులకు కూలీలుగా వెళ్లారు. పనులు చేస్తున్న ఇంటి పక్కనే ఉలువల చిన్నపురెడ్డి ఇల్లు వుంది. అది చాలా పాత ఇల్లు కావడంతో గోడ కొద్దిగా ఉబ్చి ఉండింది. ఇది గుర్తించని కూలీలు పనులు చేస్తూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో గోడ నీడన సేదతీరుతూ కూర్చున్నారు. ఇంతలో ఆ ఇంటి గోడ కూలి వారిపై పడింది. దీంతో కూలీలు పెద్దఎత్తున హాహాకారాలు చేయడంతో సమీపంలో ఉన్న గ్రామస్థులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. కూలీలు రాళ్లు, మట్టి కింద ఇరుక్కుపోయారు. ఈ సంఘటనలో వడ్డే సుబ్బరత్నమ్మ(30), వడ్డే గుడిసె పుల్లమ్మ(50) అక్కడికక్కడే మృతి చెందగా వడ్డే వెంకటలక్ష్మమ్మ, వడ్డే స్వాతి, వడ్డే వరలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పాణ్యం సిఐ పార్థసారధిరెడ్డి, నందివర్గం ఎస్‌ఐ సి.నరేంద్రకుమార్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అలాగే గాయపడిన వారిని, మృతదేహాలను బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతిచెందిన సుబ్బరత్నమ్మకు ఇద్దరు సంతానం వున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నందివర్గం ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు.