కర్నూల్

రూ. 15 లక్షల అక్రమ మద్యం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, జూలై 12: హైదరాబాద్ ప్రత్యేక టాస్క్ఫోర్స్, ఆళ్లగడ్డ ఎక్సైజ్, పోలీస్ బృందాలు మంగళవారం పట్టణ శివారులోని మద్యం స్ధావరంపై దాడులు నిర్వహించాయి. నిలువ ఉంచిన రూ. 15 లక్షల విలువ గల 600 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న అధికారులు దీనికి సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ సిఐ చంద్రహాస్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని బాచ్చాపురం సమీపంలో ఉన్న తోటలో అక్రమంగా మద్యం నిల్వ వుంచారన్న సమాచారం మేరకు హైదరాబాద్ స్పెషల్ టాస్క్ఫోర్స్ సిఐలు శ్యాంసుందర్, కృష్ణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించామన్నారు. అక్రమంగా నిల్వ వుంచిన 600 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆళ్లగడ్డకు చెందిన కృష్ణారెడ్డి, దస్తగిరి, జంబులదినె్నకు చెందిన చిన్న ఈశ్వరయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఈ దాడుల్లో రూరల్ ఎస్‌ఐ రామయ్య, ఎక్సైజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.