కర్నూల్

కర్నూలు నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూలై 14 : కర్నూలును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి పేర్కొన్నారు. రూ. 2కోట్ల నిధులతో స్థానిక విశే్వశ్యరయ్య సర్కిల్ నుంచి బిర్లా గేట్ వరకూ రోడ్డు విస్తరణ పనులతో పాటు ఫుట్‌పాత్, సెంట్రల్ వైండింగ్ పనులు, రూ. 3 కోట్లతో సి క్యాంప్ నుంచి నంద్యాల చెక్ పోస్ట్ వరకూ రోడ్డు విస్తరణ పనులను గురువారం కెఇ రాజ్యసభ్యులు టిజి వెంకటేష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కెఇ మాట్లాడుతూ నగరాన్ని స్మార్ట్‌సిటీ కింద ఎంపిక చేస్తామని చెప్పి, అమృత్ సిటీ కింద కేంద్రం ఎంపిక చేసిందన్నారు. అమృత్ సిటీ పథకం కింద నగరాభివృద్ధికి దాదాపు రూ.68కోట్లు కేటాయించిందన్నారు. సిఎం చంద్రబాబు కూడా నగరాభివృద్ధికి ఎన్ని కోట్ల రూపాయలైనా కేటాయించడానికైనా సిద్ధంగా ఉన్నారన్నారు. అందులో భాగంగా తక్కువ సమయంలోనే రూ. 200కోట్లు కేటాయిచారని స్పష్టం చేశారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచటమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నట్లు వెల్లడించారు. అధికారులు కూడా నిర్లక్ష్యం వహించకుండా అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్వీ.మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, ఎస్‌ఇ శివరామిరెడ్డి, ఎంఇ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.