కర్నూల్

మహానందిలో శాస్రోక్తంగా తొలి ఏకాదశి పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, జూలై 15: మహానంది పుణ్యక్షేత్రంలో తొలి ఏకాదశి పర్వదిన పూజలను శాస్రోక్తంగా నిర్వహించారు. శుక్రవారం మహానందిలో వెలసిన శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్ల మూల విరాట్‌లకు విశేష ద్రవ్య అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకార మండపంలో ఉత్సవ మూర్తులకు తిరుమంజన సేవా కార్యక్రమాన్ని వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, శాంతారామ్‌భట్, జ్వాలా చక్రవర్తిలతోపాటు అర్చకులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇఓ డాక్టర్ శంకర వర ప్రసాద్, చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, పాలక మండలి సభ్యులచే ఉత్సవ మూర్తులకు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, తిరుమంజన సేవ చూర్ణ అభిషేకం, ఫల నివేదన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తొలి ఏకాదశి పర్వదిన విశిష్టతను రవిశంకర్ అవధాని వివరిస్తూ మహా విష్ణువు శేష పాన్పుపై పవలించే రోజునే తొలి ఏకాదశి అంటారని, ఈ రోజు సూర్య భగవానుడు ఉత్తరాయణం నుండి దక్షణాయంలోకి అడుగిడుతారని తెలిపారు. ఏడాదిలో 24 ఏకాదశిలు వస్తే అందులో ప్రాముఖ్యత కలిగినవి వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి అని అన్నారు. నేడు పవలించిన మహా విష్ణువు కార్తిక మాసంలో వచ్చే ఉద్దాన ఏకాదశి రోజున లేస్తారన్నారు. ఈ పర్వదినాన్ని రైతులు తమ పొలాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటే వారి పంటలను పురుగు పుట్ట ఆశించకుండ అధిక దిగుబడి వస్తుందన్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యులతోపాటు ఆధ్యాత్మిక వేత్తలు, పీఠాధిపతులు చాతుర్మాస దీక్షలను కూడా తీసుకొనే రోజు ఈ రోజేనని తెలిపా రు. ఈకార్యక్రమంలో ఆలయ ఎఇ మురళీధర్‌రెడ్డి, పర్యవేక్షకులు ఈశ్వర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ సురేంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.