కర్నూల్

యువకుడిని కొట్టి చంపేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాలటౌన్, జూలై 29 : నంద్యాలలో జరుగుతున్న వరుస హత్యలతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన వైద్యుడి హత్యను మరువకముందే శుక్రవారం సుమంత్(25)ను షఫి, మురళీ కొట్టి చంపేశారు. సుమంత్ అన్న సునీల్ ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు.. ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన సుమంత్ నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్‌లో ఉన్న నంది అకాడమీలో పిఆర్‌ఓగా సంవత్సరన్నర నుంచి పనిచేస్తున్నాడని తెలిపారు. అయితే సుమంత్ పాఠశాలలో 192 మందిని చేర్పిస్తానని చెప్పినట్లు, ఎందుకు చేర్పించలేదని అందుకే నీకు రూ.25వేల జీతం ఇస్తున్నామని, నీ మీద ఇంత ఖర్చు పెట్టామని ఆ డబ్బును కట్టాలని యాజమాన్యం ఆదేశాల మేరకు సుమంత్‌పై షఫి, మురళీలతో దాడి చేయించినట్లు చెప్పారు. గురువారం రాత్రి సుమంత్‌ను ఇరువురు తీవ్రంగా గాయపరిచి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని, సుమంత్ అన్న సునీల్‌కు ఫోన్ చేసి సుమంత్‌కు ఆయాసం ఎక్కువైందని ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయారని తెలిపారన్నారు. ఫోన్ సమాచారం అందిన వెంటనే సునీల్ శుక్రవారం తెల్లవారుజామున 4గంటలకు ఆసుపత్రికి చేరుకొని వైద్యుడిని విచారించగా ఆసుపత్రికి రాక ముందే మృతి చెందాడని, రెండు గంటలకు పైగానే అయిందని వైద్యులు తెలిపారన్నారు. విషయం తెలుసుకున్న డిఎస్పీ హరినాథరెడ్డి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మార్చురీ గదిలో ఉన్న మృతుడు సుమంత్‌పై ఉన్న గాయాలను పరిశీలించారు. అన్న సునీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నంద్యాల పట్టణంలో జరుగుతున్న హత్యలతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎంపి ఎస్పీవై రెడ్డి ఇంటి వద్ద ధర్నా
ఎంపి ఎస్పీవై రెడ్డికి చెందిన నంది అకాడమీలో పనిచేసే సుమంత్‌ను అన్యాయంగా తాళ్లతో కట్టేసి కొట్టి చంపారని ఆరోపిస్తూ శుక్రవారం ఎంపి ఇంటి ముందు విద్యార్థి సంఘం నాయకులు రాజునాయుడు, నాగనవీన్, రామచంద్రుడులు తదితరులు ధర్నా చేశారు. యాజమాన్యం వైఖరి నశించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు నిరసన తెలిపారు. శనివారం నంది విద్యాసంస్థల వద్ద భారీ ధర్నా చేపట్టినట్లు వారు తెలిపారు.