కర్నూల్

ఉద్యమంతోనే ప్రత్యేక రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, ఏప్రిల్ 12:ఉద్యమిస్తేనే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బైరెడ్డి చేపట్టిన రాయలసీమ చైతన్య యాత్ర మంగళవారం మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు, వడ్డెమాను, అల్లూరు గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ సీమలో అన్ని వనరులు వున్నప్పటికీ కేవలం రాజకీయ నేతల స్వార్థం వల్ల కోస్తాంధ్ర ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ అక్కడే రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల సీమకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. నాడు కర్నూలు రాజధానిని హైదరాబాద్‌కు తరలించి మోసం చేసిన నాయకులు నేడు మళ్లీ అదే కర్నూలును రాజధానిగా ప్రకటించకుండా రాజకీయాల కోసం కోస్తాంధ్రలో రాజధానిని ఏర్పాటు చేయడంపై బైరెడ్డి ఆగ్రహించారు. సిఎం చంద్రబాబు రాయలసీమ వాసి అయినా ఇక్కడి ప్రజలు ఎన్నికల్లో ఆదరించలేదన్న కోపంతో ప్రాంతీయ అభిమానం కూడా చూడకుండా విజయవాడలో రాజధానిని ఏర్పాటు చేయడం సబబు కాదన్నారు. రాజధాని నిర్మాణానికి సీమలో అన్ని వనరులు పుష్కలంగా వున్నప్పటికీ ఈ ప్రాంతంపై వివక్ష చూపడంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారన్నారు. ఇప్పటికైనా సీమవాసులు మేల్కొనకపోతే భవిష్యత్తు తరాల వారికి అన్యాయం చేసిన వారమవుతామన్నారు. యాత్రలో ఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.