కర్నూల్

పుష్కరాల్లో భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాములపాడు, జూలై 31:కృష్ణా పుష్కరాల్లో భక్తులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ తెలిపారు. శ్రీశైలం టూటౌన్ ఔట్‌పోస్టులో ఆదివారం ఆమె విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ సున్నిపెంట గ్రామంలోని లాడ్జిలు, హోటళ్ల యజమానులను సమావేశపరచి హెచ్చరికలతో కూడిన ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, హోట ళ్లు, లాడ్జిల్లో మద్యం తాగేందుకు అనుమతించరాదని, మద్యం దుకాణాలు, హోటళ్లను రాత్రి 10గంటల లోపే మూసి వేయాలన్నారు. లాడ్జిల్లో దిగే వ్యక్తుల పూర్తి వివరాలు నమోదు చేసుకుని ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపుకార్డు తీసుకుని స్థానిక పోలీసులకు అందజేయాలని సూచించారు. ఎవరిపై అయినా ఏమాత్రం అనుమా నం కలిగినా వెంటనే పోలీసులకు సమాచారం తెలపాలన్నారు. అలాగే భక్తులకు రుచికరమైన నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పుష్కరాల నేపథ్యంలో ముందస్తుగా ప్రతి రోజూ వాహన తనిఖీలు నిర్వహిస్తామని ఆర్టీఓ చెక్‌పోస్టుల వద్ద తనిఖీ కేంద్రా లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాల బందోబస్తులో సుమారు 700 మందికి పైగా వలంటీర్లు, ప్రత్యేక బలగాలు, నిఘా కెమెరాలు, డాగ్‌స్క్వాడ్‌లు నిత్యం పహారా కాస్తూ పుణ్యస్నానం ఆచరించే భక్తులకు పట్టిష్ట బందోబస్తు కల్పిస్తారన్నారు. సిఐ విజయకృష్ణ, ఎస్‌ఐలు ఓబులేసు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.