కర్నూల్

రద్దీ సమయంలో భక్తులు నిరీక్షించాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 6 : కృష్ణా పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల రద్దీ ఎక్కువ గా ఉంటే స్నానపు ఘాట్లలో రద్దీ తగ్గే వరకూ శ్రీశైలం, సంగమేశ్వరం సమీపంలో నిరీక్షించాల్సిందే. ఆ మేరకు పుష్కరనగర్‌లో భక్తుల కోసం ఏర్పా ట్లు చేశారు. శ్రీశైలం, సంగమేశ్వరం ప్రాంతాలు అడవిలో ఉండటం, పుష్క ర ఘాట్ల వద్ద స్థలాభావం వంటి కారణాలతో అధికారులు నాలుగంచెల వ్యవస్థను తయారు చేశారు. మొదటి అంచెలో శ్రీశైలం వెళ్లే యాత్రికుల కో సం దోర్నాల, సున్నిపెంట వద్ద పుష్కరనగర్‌లు నిర్మించగా సంగమేశ్వరం వెళ్లే భక్తుల కోసం ఆత్మకూరు వద్ద పుష్కరనగర్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో 500 మంది భక్తులు సేద తీరేందుకు అల్పాహార, భోజన సదుపాయాలు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. సంగమేశ్వరం, శ్రీశైలంలోని స్నానపు ఘాట్లలో రద్దీని క్రమబద్ధీకరించిన తరువాత పుష్కరనగర్‌లో నిరీక్షిస్తున్న భక్తులను అనుమతిస్తారు. ప్రధానంగా సంగమేశ్వరం వద్ద వచ్చి స్నానం చేసి వెళ్లిపోయే వారి సంఖ్య అ ధికంగా ఉండటంతో రాకపోకల సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. స్నానపు ఘాట్ల వద్ద రద్దీ నియంత్రణకు సంగమేశ్వరం వచ్చే ప్రైవేట్, ఆర్టీసీ బస్సులను రెండవ అంచెలో నిలిపేస్తారు. ఇక్కడి నుంచి భక్తులు స్నానపు ఘాట్లకు చేరుకోవడానికి మినీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఉచితంగా వీటిలో వెళ్లి వచ్చేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన బస్సులలో భక్తులు మూడవ అంచెలో ఏర్పాటు చేసిన షటిల్ బస్టాండ్ వరకూ చేరుకోవచ్చు. అక్కడి నుంచి సమీపంలోని ఘాట్ల వరకూ కాలి నడకన చేరుకోవాల్సి ఉంటుంది. మూడవ అంచెలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి ప్రముఖులకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారు తమ వాహనాల్లో ఇక్కడి వరకూ వచ్చి స్నానాలకు వెళ్లాల్సి ఉంటుంది. నాలుగవ అంచెలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఆ హోదా కలిగిన ఇతర అధికార, అనధికారులకు బస ఏర్పాటు చేశారు. స్నానపు ఘాట్లకు అత్యంత సమీపంలో నాలుగవ అంచె ఏర్పాటు చేసిన అధికారులు వివిఐపిలు తమ వాహనాల్లో ఇక్కడి వరకూ చేరుకోవచ్చు. ఇక సంగమేశ్వరం వచ్చే భక్తుల కోసం రెండవ అంచెలో ఉన్న షటిల్ బస్టాండ్ సమీపంలోనే అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు. కేవలం భక్తులు మాత్రమే ఇక్కడ భోజనాలు చేయాల్సి ఉంటుంది. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందితో పాటు భక్తుల సేవ కోసం వచ్చే వారికి మూడవ అంచెలో విఐపిల కోసం సిద్ధం చేసిన ప్రాంతంలో భోజన సదుపాయం కల్పించారు. ఇక్కడ భక్తులకు భోజన వసతులు ఉండబోవని వెల్లడిస్తున్నారు.
శ్రీశైలం వచ్చే యాత్రికులు మొదట దోర్నాల, తరువాత సున్నిపెంట వద్ద నిరీక్షించిన తరువాత అటు లింగాలగట్టుకు వెళ్లే వారిని, ఇటు శ్రీశైలం వెళ్లే వారిని ఆయా ప్రాంతాల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని అనుమతిస్తారు. రెండవ అంచెలో లింగాలగట్టుకు వెళ్లే వారికి సున్నిపెంటలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో తమ వాహనాలను పార్క్ చేసి అక్కడి నుంచి మూడవ అంచెలో ఏర్పాటు చేసిన షటిల్ బస్టాండ్ వరకూ ఉచితంగా మినీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. షటిల్ బస్టాండ్ నుంచి కాలి నడకన నాలుగవ అంచెలో స్నానపు ఘాట్లకు చేరుకునే అవకాశం కల్పించారు. ఇక శ్రీశైలం వెళ్లే యాత్రికులు దేవాలయ ప్రాంతానికి చేరుకోకముందే రెండవ అంచెలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలను నిలిపి వేసి అక్కడి నుంచి ఉచిత మినీ బస్సుల్లో శ్రీశైలం చేరుకోవాల్సి ఉంటుంది. ఇక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి విఐపిలు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఆ స్థాయి అధికారులు, అనధికారులు నేరుగా తమకు కేటాయించిన గదుల వద్దకు చేరుకునే అవకాశం కల్పించారు. ఏ హోదా లేని వారికి వాహనాల పాసులు మంజూరు చేసే ప్రశే్న లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక శ్రీశైలం చేరుకున్న యాత్రికులు గదుల్లో విశ్రమించే వారు పక్కకు పోగా నేరుగా స్నానాలకు వెళ్లే వారిని పాతాళగంగకు క్రమపద్ధతిలో పంపుతారు. అక్కడి నుంచి వీలైనంత త్వరగా స్నానాలు ముగించి తిరిగి శ్రీశైలం చేరుకునేందుకు భక్తులకు నిరంతరం మైకుల ద్వారా సూచనలు చేస్తూ ఉంటారు. భక్తుల భద్రత కోసం నాలుగంచెల వ్యవస్థను సిద్ధం చేశామని భక్తులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.