కర్నూల్

క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు అర్బన్, ఆగస్టు 9:క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం నగరంలో జాతిపిత గాంధీ మహాత్ముని స్ఫూర్తితో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక మాంటిస్సోరి స్కూల్ నుంచి ప్రారంభమై కలెక్టరేట్ మీదుగా రాజ్‌విహార్ కూడలి వరకూ సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తెల్లదొరలను దేశం నుంచి బహిష్కరించేందుకు గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారని, ప్రతిఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం దేశాన్ని అవినీతి, అక్రమాలు, బాలకార్మిక వ్యవస్థ, గృహ హింస, మద్యం, తదితర సమస్యలు పట్టిపీడిస్తున్నాయని, వాటిని నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు నడుం బిగించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.