కర్నూల్

ముచ్చుమర్రికి పుష్కరశోభ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, ఆగస్టు 9 : పగిడ్యాల మండల పరిధిలోని ముచ్చుమర్రి గ్రామం పుష్కర శోభను సంతరించుకుంది. ముచ్చుమర్రిలో ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేస్తున్న సీమ పుష్కర ఏర్పాట్లు భళా అనిపించేలా రూపుదిద్దుకుంటున్నాయి. గ్రామ సమీపంలో కృష్ణానదికి అత్యంత సమీపంలో సుమారు పదెకరాల విస్తీర్ణంలో భక్తులు పుణ్యస్నానం చేసేందుకు పెద్ద కోనేరు నిర్మించారు. దీనికితోడు మహిళలు, పురుషుల కోసం కోనేరు సమీపంలోనే వేర్వేరుగా తుంపర స్నానం(షవర్ బాత్) ఏర్పా టు చేశారు. కృష్ణానదిలోని నీటిని అతిపెద్ద మోటార్ల ద్వారా కోనేరులోకి, షవర్లలోకి పంపింగ్ చేసే ఏర్పాట్లు చేశారు. ఏ ఒక్క భక్తుడు ఇబ్బందికి లోనుకోకుండా దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూత్ర, మరుగుదొడ్లు కూడా ఘాట్ సమీపంలో నిర్మించారు. ఘాట్ సమీపంలో వున్న పురాతన శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయంతో పాటు పలు దేవాలయాలను అందంగా ముస్తాబు చేశారు. పుష్కర స్నానం ఆచరించిన భక్తులు దేవాలయాలను సందర్శించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించారు. భోజన అనంతరం భక్తులు సేద తీరేందుకు విశ్రాంత మండపాలు సైతం ఏర్పాటు చేశారు. పుష్కరాల సందర్భంగా పిండ ప్రదాన కార్యక్రమాలు చేసేందుకు కూడా ఏర్పాటు చేశారు. సుమారు నెల రోజులుగా ప్రతిరోజూ 300 మంది కూలీలు పుష్కర పనులను చేస్తున్నారు. పుష్కరాల ప్రారంభం రోజున 12వ తేదీ హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన వెయ్యి మంది ముత్తయిదువులతో పెద్దఎత్తున పుష్కర హారతి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముత్తయిదువులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్ ఏర్పాటు చేశారు. కోనేరు మధ్యలో వుంచిన శ్రీకృష్ణుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీనికితోడు అక్కడే కృష్ణవేణమ్మ పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో సంగమేశ్వరం మినహాయిస్తే నదీ తీర గ్రామాల్లో ఎక్కడా ప్రభుత్వం పుష్కరఘాట్‌లు ఏర్పాటు చేయకపోవడంతో అధిక శాతం మంది భక్తులు ఇక్కడికే వచ్చే అవకాశాలు వున్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. రోజుకు 10 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరినప్పటికీ ముచ్చుమర్రిలో ఏర్పాటు చేసిన సీమ పుష్కరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టారు. 12 రోజుల పాటు ముచ్చుమర్రిలో పుష్కరాలు నిర్వహించి చరిత్ర సృష్టించేలా బైరెడ్డి దగ్గరుండి ఏర్పాటట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన పుష్కరఘాట్‌లు కృష్ణమ్మ వరదలో కొట్టుకుపోయాయని, ముచ్చుమర్రిలో చేపట్టే పుష్కరాలు ప్రభుత్వం పుష్కరాలకు దీటుగా నిర్వహించి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని బైరెడ్డి రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు.