కర్నూల్

తుంగాతీరవాసికి విశేష పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, ఆగస్టు 18: పవిత్ర తుంగా తీరంలో వెలసిన భక్తవరధుడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి గురువులకు పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో గురువారం విశేష పూజలు జరిగాయి. 345వ సప్త ఆరాధనోత్సవాల సందర్భంగా రెండవ రోజు రజత మండపోత్సవం వేడుకలను పురస్కరించుకుని వేకువ జామున స్వామి మూల బృందావనానికి నిర్మల్య విసర్జన, ఉత్సవరాయల పాదపూజ, పంచామృతాభిషేకం, శ్రీ మూల రామ దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, అలంకార సంతర్పణం, అష్ట్ధోకం, సర్వసమర్పణ సేవలు చేసి ప్రత్యేక హారతి ఇచ్చారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 345 వ సప్త ఆరాధనోత్సవాలు సందర్భంగా పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో సాయంత్రం యోగీంద్ర కళామండపంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు ఆకట్టుకున్నాయి. కర్ణాటకలోని విజయాపూర్‌కు చెందిన గీతాసంజీవి కులకర్ణి, బెంగళూరుకు చెందిన రాఘవేంద్రన్ వారిచే దాసవాణి, బళ్ళారికి చెందిన కుమారి పల్లవి దేశాయ్‌చే భరత నాట్యం, బెంగళూరుకు చెందిన డాక్టర్ మురళీధర్‌చే నిర్వహించిన వేణుగానం కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం పీఠాధిపతి వారికి ఫల పుష్ప, మంత్రాక్షితలు, జ్ఞాపిక ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ప్రముఖ విద్వాన్ పండితులు రాజాఎస్ గిరియాచార్, ఏకె సుయమీంద్రాచార్, ఎఎఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, శ్రీపతాచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, ద్వారపాలక అనంత స్వామి దార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్, ప్రిన్సిపల్ వాదిరాజాచార్ తదితరలు పాల్గొన్నారు.
వైభవంగా శాకోత్సవం వేడుకలు
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం రాత్రి పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శాకోత్సవం వేడుకలను వైభవంగా నిర్వహించారు. 345వ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా రజత మండపోత్సవం పురస్కరించుకుని వివిధ రకాల కూరగాయులకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు అనంతరం శ్రీ ప్రహ్లాదరాయలుకు ఊంజల సేవ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ ప్రహ్లాదరాయలను గజ, కొయ్యా, వెండి బంగారు రథోత్సవాపై అధిష్ఠించి మఠం ప్రాకారంలో ఘనంగా ఊరేగించారు.