కర్నూల్

ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధి శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఆగస్టు 19:రాష్ట్ర ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధి చేసింది శూన్యమని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన పుష్కర నగర్‌లను శుక్రవారం కోట్ల సందర్శించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, అయినా ఎక్కడా పనులను నాణ్యతగా చేపట్టలేదన్నారు. కర్నూలు నగరానికి కృష్ణా పుష్కరాల కింద రూ. 15కోట్లు కేటాయించారని, అందులో భాగంగా పుష్కర భక్తుల విడిది కోసం 3 పుష్కర నగర్‌లు ఏర్పాటు చేశారన్నారు. సంగమేశ్వరం, శ్రీశైలంలో ఏర్పాటు చేసిన ఘాట్‌లలో పుణ్యస్నానం చేయటానికి నేరుగా వెళ్తారే తప్ప పుష్కర నగర్‌కు ఒక భక్తుడు కూడా రావడం లేదన్నా రు. ఒకవేళ వచ్చినా ఇక్కడ సౌకర్యాలు లేక భక్తులు వెనుదిరిగిపోతున్నారని వెల్లడించారు. ఒక్కో పుష్కర నగర్ నిర్మాణం కోసం రూ. 20 లక్షలు ఖర్చు చేశారన్నారు. భక్తులు రాని పుష్కర నగర్‌లను ఏర్పాటు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. పుష్కర పనులను నాణ్యతా లోపంతో చేస్తున్నారని, అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పుష్కర పనుల్లో విపరీతమైన అవినీతి చోటు చేసుకుందని, దానిపై విచారణ జరిపించి బాధ్యులపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోట్ల వెంట డిసిసి అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌బా బు, సర్దార్‌బుచ్చిబాబు, అశోకరత్నం, ఆకెపోగు వెంకటస్వామి, శ్రీనివాసరెడ్డి, సలాం, చున్నుమియ్య పాల్గొన్నారు.