కర్నూల్

సకల దేవతా నిలయం గోవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఆగస్టు 25: శ్రీశైలం మహాక్షేత్రంలో గోకులాష్టమి పర్వదినం పురస్కరించుకుని గురువారం ఉద యం ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులం వద్ద గోవులకు ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రతినిత్యం ఆలయంలో ప్రాతఃకాల సమయంలో నిత్యసేవగా గోపూజ నిర్వహిస్తున్నప్పటికీ కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకుని గురువారం నిత్యసేవతో పాటు గోవులను అర్చకులు విశేషంగా పూజించా రు. కార్యక్రమంలో 11 గోవులకు, గోవత్సములకు పూజాధికాలు శాస్త్రానుసారంగా నిర్వహించారు. ఈకార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ, అనంతరం లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక వేద పండితులు సంకల్పాన్ని పఠించారు. శ్రీసూక్తంతో, అష్టోత్తర మంత్రంతో షోడశోపచారంలతో గోమాతకు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈపూజలో గోవులన్నింటికి వస్త్రాలు, పుష్పాలను సమర్పించారు. వేద పారాయణంతో గోవులకు నివేదన నీరజ మంత్రపుష్పాలు సమర్పించారు. వేద సంస్కృతిలో గోవుకు ఎంతో విశేష స్థానం ఉందని వేదాలు, ఉపనిషత్తులు మొదలగున్నీ పేర్కొంటున్నాయని, 33కోట్ల దేవతలకు ఆవాస స్థానం కావడంతో ఒక్క గోమాతను పూజిస్తే 33కోట్ల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా గోపూజను ఆచరించడం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుచేతనే ప్రతియేటా శ్రీకృష్ణ జయంతి రోజున గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు పండితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇఓ దంపతులు నారాయణభరత్‌గుప్త, జెఇఓ హరినాథరెడ్డి, ఆలయ అర్చక వేద పండితులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.