కర్నూల్

సబ్సిడీపై రెయిన్‌గన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఆగస్టు 26:జిల్లాలో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు సాగు చేసిన పంటలకు ప్రాణం పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం సబ్సిడీపై రెయిన్‌గన్‌లు పంపిణీ చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఏపిఎంఐపి పిడి శ్రీనివాసులు తెలిపారు. ఆయన శుక్రవారం తన ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల గురించి ప్రభుత్వానికి వివరించి పంటలను కాపాడేందుకు దాదాపు 4,472 రెయిన్‌గన్లు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు పంపించారన్నారు. వాటి ఆధారంగా జిల్లాకు రెయిన్‌గన్‌లను మంజూరు చేస్తామన్నారు. ప్రస్తుతం 150 ఎకరాలను ఒక యూనిట్‌గా చేసి, జిల్లాలో 1,898 యూనిట్స్ మంజూరు చేశారని, వాటిలో ఒక యూనిట్ కింద 2 రెయిన్‌గన్‌లు, 2 స్పింక్లర్లు, 2 ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వీటిని పర్యవేక్షించేందుకు 5 కంపెనీలకు ఇచ్చామని, ఒక్కో యూని ట్ దగ్గర ఒక ప్రతినిధి ఉండి రైతులకు రెయిన్‌గన్‌ల గురించి అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. ఇప్పటి వరకూ కర్నూలు డివిజన్‌కు 802 యూనిట్స్, నంద్యాల డివిజన్‌కు 244 యూనిట్లు, ఆదోని డివిజన్‌కు 973 యూనిట్లు మంజూరయ్యాయన్నారు. రెయిన్‌గన్‌లను స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాములో ఉంచామన్నారు. రెయిన్‌గన్‌లు కావాల్సిన రైతులు మండల వ్యవసాయాధికారికి దరఖాస్తు చేసుకుంటే వాటి ఆధారంగా రెయిన్‌గన్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక రెయిన్ గన్ ధర రూ. 25వేల వరకూ ఉంటుందని, రైతులకు 60శాతం సబ్సిడీపై ఇస్తామన్నారు.