కర్నూల్

జిల్లా వ్యాప్తంగా వర్షాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఆగస్టు 30:జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి దాదాపు 48 మండలాల్లో వర్షం కురిసింది. గత నెల రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో కళ్ల ముందే సాగు చేసిన పంటలు ఎండిపోతుంటే రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ తరుణంలో వర్షం కురవటంతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 54 మండలాలకు గానూ నంద్యాలలో 162.4 మి.మీ, గోస్పాడు 162.4, మహానంది 110.6, చాగలమర్రి 92, కొలిమిగుండ్ల 80.2, పాణ్యం 77.2, పగిడ్యాల 67.4 మి.మీ వర్షపాతం నమోదయ్యాయి. అలాగే మరో 16 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా, 15 మండలాల్లో సాధారణ వర్షపాతం, 10మండలాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యాయి. ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు వేరుశెనగ, కంది, పత్తి, ఆముదం, మొక్కజొన్న, కొర్ర, ఉల్లి, మిరప పంటలు ఎక్కువగా సాగు చేశారు. అయితే జిల్లాలో దాదాపు 20 రోజులకు పైగా వర్షం జాడ లేకపోవడంతో వేరుశెనగ, ఆముదం, కొర్ర పంటలు పూర్తి ఎండిపోవడంతో అనేక ప్రాంతాల్లో పైరును తొలగించారు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి కంది, పత్తి పంటలకు కాస్తా ఊరట లభించింది. మరొక వారం రోజుల లోపు ఇంకో వర్షం కురిస్తే ఆ పంటలకు ఢోకా ఉండదని వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది కూడా కరవు తప్పేటట్లు లేదని అనుకుంటున్న తరుణంలో వర్షం కురవడంతో కాస్త ఊపిరి సల్పినట్లయిందని రైతులు పేర్కొంటున్నారు.