కర్నూల్

కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, సెప్టెంబర్ 2: రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరికెర తాండ గ్రామం సమీపంలో శుక్రవారం జరిగిన సభలో స్పష్టంచేశారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి గోరుకల్లు రిజర్వాయర్ పూర్తి చేశానని హంద్రీనీవా ద్వారా నీటిని సీమ జిల్లాలకు అందించడానికి కాలువలను వెడల్పు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 110 మున్సిపాలిటీల్లో 5లక్షల 50వేల వీధి దీపాలను అమరావతిలో కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షణ చేసి వాటిని సక్రమంగా ప్రజలకు వెలుగులు అందించేలా సాంకేతిక సహాయంతో కృషి చేస్తానన్నారు. తనకు ఉన్న మూడవ కన్నుతో చూస్తూ సమస్యలు తీర్చి ప్రతి ఇంటికి ఒక బిడ్డగా ఉంటానని సిఎం అన్నారు. తాను ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి అబ్దుల్ కలాం లాంటి శాస్త్ర వేత్తను రాష్టప్రతిని చేశానని, అలాంటి నాపైన వైకాపా నాయకులు విమర్శలు చేయడం తగదన్నారు. ఇప్పుడు జనాభా తగ్గింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మందిని పిల్లలను కలిగి ఉండాలని, లేని పక్షంలో దేశంలో వృద్ధులు ఎక్కువ అవుతారన్నారు. రాయలసీమ ప్రజల్లో కరవు వస్తే తమ కర్మ అని సరిపెట్టుకోవద్దని చెప్పారు. ఇప్పుడు పంటలు రక్షించుకోవడానికి తమ ఆలోచనతోనే రెయిన్‌గన్‌ను రూప కల్పన చేశామన్నారు. రెయిన్‌గన్ల ద్వారా 4లక్షల ఎకరాల పంటలను కాపాడడం జరిగిందని చెప్పారు. కష్టాల్లో ఉన్న రైతులు కంటతడి పెట్టకుండా చేయడానికి రుణమాఫీ చేయమని కేంద్రాన్ని కోరితే కేంద్రం రుణమాఫీ చేయలేదని, అయినప్పటికీ 10 శాతం వడ్డీతో రుణమాఫీ చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికతో రైతులు దీమాగా ఉండాలని లక్ష్యంతో నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాలకు నీటిని అందించడానికి కృషి చేస్తానని, టమోటా, ఉల్లిని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. రూ.330 కోట్లతో ఫైబర్ గిల్డ్ ఏర్పాటు చేస్తామని, దానివల్ల ప్రతి ఇంట్లో సెటాఫ్ బాక్స్‌పెట్టుకుని 100 చానల్స్‌ను చూడడమే కాకుండా టీ తాగుతూ సిఎం వద్ద కూడా ముఖాముఖిగా తమ సమస్యలను చెప్పుకోచ్చని సిఎం అన్నారు. వ్యవసాయానికి కాలేజీలను అనుసంధానం చేశానని, కాబట్టి విద్యార్థులు తమకు ఉన్న విజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగించుకోవాలని అన్నారు. కరవును చూసి భయపడవద్దని, కరువై యుద్ధం ప్రకటించానన్నారు. వరుణదేవుడు కరుణించకపోయిన కరవును సమర్థవంతంగా ఎదురుకుందామన్నారు. ప్రజల అండదండలే తనకు టానిక్ అని, నిర్ధిష్టమైన ప్రణాళిక పెట్టుకుని పని చేస్తున్నానని అన్నారు. దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగం 1.8శాతం అభివృద్ధి సాధిస్తే రాష్ట్రంలో వ్యవసాయ రంగం 22శాతం అభివృద్ధిని సాధించిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు, డిఐజి రమణకుమార్, ఎమ్మెల్యేలు ఎస్వీమోహన్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, బుడ్డారాజశేఖర్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్, జయనాగేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్ విజయ్‌మోహన్, ఎస్పీ రవికృష్ణ, జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఆలూరు తెలుగుదేశం ఇన్‌ఛార్జి వీరభద్రగౌడ్, జలమండలి సభ్యులు కుమార్‌గౌడ్, నాయకులు కెయి ప్రతాప్, గుడిసె కృష్ణమ్మ, జడ్పీటీసీ బొజ్జమ్మ, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, గంగుల ప్రభాకర్‌రెడ్డి, నాయకులు ఉమాపతి నాయుడు, తిక్కారెడ్డి, బిటి. నాయుడు, సోమిశెట్టివెంకటేశ్వర్లు, మార్కెట్‌యార్డు చైర్మన్ భాస్కర్‌రెడ్డి, ఉరుకుంద దేవస్థానం చైర్మన్ చెన్నబసప్ప, జిల్లా డిఎస్‌పిలు శ్రీనివాసరావు, ఓబులేసు, మురళీదర్, రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి ఉల్లి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఉల్లి రైతులను కలుసుకుని వారి కష్టాలను తెలుసుకున్నారు.