కర్నూల్

ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధి శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 4:టిడిపి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేస్తుందే తప్ప అభివృద్ధి చేసింది శూన్యమని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. నగరంలో నత్తనడకన జరుగుతున్న కృష్ణానగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులను ఆదివారం కోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోగా ప్రజాసమస్యలను గాలికి వదిలి వేశారని మండిపడ్డారు. ఇక ప్రతిపనిలో తన పార్టీ వారికి టెండర్లు దక్కేలా చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. నిరంతరం గ్లోబల్ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణానగర్ రైల్వే అండర్ బ్రిడ్జితో పాటు మరో 4 పనులకు శంకుస్థాపన చేశామన్నారు. అయితే రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పూర్తయితే ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని పనులను ఆపేశారని మండిపడ్డారు. కృష్ణానగర్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి లేకపోవటం వల్ల రైలు వచ్చేటప్పుడు గేట్ మూసివేస్తారని, దాంతో ఇరుకుగా ఉన్న రోడ్డు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. అయితే టిడిపి ప్రభుత్వం 4 నెలల క్రితం కృష్ణానగర్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి పనులు చేపట్టేందుకు గేట్‌ను మూసివేసి గుంతలను తవ్వి మధ్యలోనే వదిలివేశారన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న చిరువ్యాపారులు వ్యాపారాలు లేక చాలా నష్టపోతున్నారన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంత ప్రజలు రాకపోలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే కృష్ణానగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కోట్లతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎం.మదనగోపాల్, జడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, డిసిసి నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, పెద్దారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శివకుమార్, శ్రీనివాసరెడ్డి, అశోకరత్నం, సత్యరాజ్, తదితరులు పాల్గొన్నారు.