కర్నూల్

క‘న్నీటి’ కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఏప్రిల్ 3:స్వార్థ రాజకీయాల వల్ల నగర ప్రజలు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఏర్పాటు చేసి నగర ప్రజల దాహార్తి తీర్చాలనుకుంటే స్వార్థ రాజకీయాల వల్ల సాధ్యం కావటం లేదని అధికారులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాం లో అదనపు ట్యాంకు ఏర్పాటు కోసం నిధులు మంజూరైనా స్వార్థ రాజకీయాల వల్ల అవి కాస్త వెనక్కి వెళ్లిపోయాయి. 1998లో అప్పటి జనాభాకు అనుగుణంగా ఒక సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జనాభా నగర 5.5 లక్షలకు చేరుకుంది. దీనికి తోడు 3 గ్రామ పంచాయతీలు విలీనం అయ్యాయి. మున్సిపల్ నిబంధనల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా 100 లీటర్లను మాత్ర మే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా 71.32 ఎంఎల్‌డి లీటర్ల నీరు విడుదల చేయాలి. కానీ కేవలం 67 ఎంఎల్‌డిల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. కొన్ని కాలనీలకు రోజు విడిచి రోజు, మరి కొన్ని కాలనీలకు 3 రోజులకు ఒకసారి నగర పాలక సంస్థ అధికారులు నీరు విడుదల చేస్తున్నారు. ఇక నగర శివారులోని గీతాముఖర్జీనగర్, సమతానగర్, మమతానగర్, సోనియాగాంధీనగర్, బాలాజీ నగర్, గణేష్ నగర్ (కొట్టాలు), అమీన్ హైదర్‌ఖాన్ నగర్, రాజీవ్ గృహకల్ప, నాగేంద్రనగర్, స్టాంటన్‌పురం వంటి కాలనీల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇటీవల నగర పాలక సంస్థలో విలీనమైన మామిదాలపాడు, మునగాలపాడు, స్టాంటన్‌పురంలలో పైపులైన్ పనులు సక్రమంగా పూర్తికాలేదు. దీనికి తోడు అనేక చోట్ల బోర్లు ఎండిపోయాయి. సింటెక్స్ ట్యాంకులు అలంకారప్రాయంగా మారాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ట్యాంకర్ల ద్వారా వచ్చే నీటి పైనే ఆధారపడుతున్నారు. ఆయా కాలనీలకు వాటర్ ట్యాంకర్ వెళ్లిందంటే నీటి కోసం మహిళలు, పురుషులు పరుగులు తీస్తున్నారు. కర్నూలు నగరానికి సుంకేసుల రిజర్వాయర్ నుంచి మామిదాలపాడు దగ్గర ఉన్న సమ్మర్ స్టోరేజీకి నీటిని తరలించి అక్కడ నీటిని శుద్ధి చేసి నగర ప్రజలకు సరఫరా చేస్తారు. అయితే సుంకేసుల రిజర్వాయర్‌లో 1.20 టిఎంసిల నీరు నిల్వ ఉంటే వేసవిలో నగర ప్రజలు నీటి కోసం ఏవిధమైన ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. అయితే సుంకేసుల రిజర్వాయర్‌లో కేవలం 0.5 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉందని మున్సిపల్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నీరు నగర ప్రజలకు 20 రోజుల పాటు కూడా సరిపోదు. పొంచి ఉన్న నీటి ముప్పును అధిగమించేందుకు రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్ రెడ్డి మాత్రం తుంగభద్రలో బోర్‌వెల్స్ వేసి తద్వారా నగర ప్రజల దాహార్తి తీర్చాలని పేర్కొంటున్నారు. అంతేకాకుండా తుంగభద్ర డ్యాం నుంచి నీరు విడుదల చేసి ప్రజల నీటి కష్టాలు తీర్చాలని కోరారు.