కర్నూల్

అవినీతికి చరమగీతం పాడే సమాచార హక్కు చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, సెప్టెంబర్ 9: అవినీతికి చరమగీతం పాడేందుకే సమాచార హక్కు చట్టం 2005లో అమలులోకి వచ్చిందని, యువత నడుం బిగించి సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని అవినీతిని అంతమొందించి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయబాబు అన్నారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని నేషనల్ పీజీ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు కళాశాల అధినేత డా. ఇంతియాజ్ అహ్మద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 23 ట్రిలియన్ కోట్ల అవినీతి సొమ్ము పక్కదారి పట్టిందన్నారు. ఇదే సొమ్ము ప్రజలకు ఉపయోగపడితే అందరికి ఉచిత విద్య, ఉచిత కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చేవన్నారు. పేదరికం ఛాయలులేని దేశంగా గుర్తింపు పొందుతుందని అన్నారు. యువత భావిస్తున్నట్లు సినిమాల్లో నటిస్తున్న హీరో, హీరోయిన్లు నిజమైన హీరోలు కాదని, దేశానికి నిజమైన హీరోలు స్వాతంత్య్రం సాధించిపెట్టిన మహాత్మాగాంధీ, స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్న అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, వౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వారేనన్నారు. ప్రపంచ ఆర్థిక సంపత్తి కలిగిన దేశాల్లో భారత్ నాల్గవ స్థానంలో ఉన్నా దారిద్య్రం, నివాస గృహాలు, పౌష్టికాహారం లేని వారు కోట్లలో ఉన్నారన్నారు. అవినీతి కారణంగానే సంపద కొంతమంది వద్దే ఉండిపోయిందన్నారు. యువతకు కుటుంబ బాధ్యత, సామాజిక బాద్యత ఉండాలన్నారు. ప్రజాపాలనలో పారదర్శకత కోసమే సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిందన్నారు. ఏదైన సమాచారం అడిగినా ఇవ్వని అధికారులకు రూ.25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. చట్టం ప్రకారం సమాచారం పొందని వారికి రూ.2 లక్షల వరకు నష్టపరిహారం అందుతుందన్నారు.