కర్నూల్

స.హ చట్టం కింద ఈ ఏడాది 2,255 కేసులు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, సెప్టెంబర్ 9: సమాచార హక్కు చట్టం కింద ఈ ఏడాది 2,255 కేసులు రాగా, వాటిలో 33 కేసులను విచారించి అక్కడికక్కడే పరిష్కరించామని ఉభయ తెలుగు రాష్ట్రాల సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయబాబు తెలిపారు. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై శిక్షణ తరగతులు నిర్వహించి యువతకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఏ శాఖ సమాచారం అయినా తెలుసుకునే హక్కు ఈ చట్టం ద్వారా ప్రజలకు వర్తించబడిందన్నారు. కింది స్థాయి నుండి రాష్టస్థ్రాయి వరకు సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని కోరుతూ వేలాదిగా దరఖాస్తులు అందుతున్నాయన్నారు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన వారికి నిర్ణీత గడువులోపు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సమాచార హక్కు చట్టంపై అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఇంజనీరింగ్ కళాశాల, నంద్యాలలోని నేషనల్ పిజి కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్డీవో కార్యాలయం ఎవో సుధాకర్, ఎస్‌ఓ అల్లీపీరా తదితరులు పాల్గొన్నారు.