కర్నూల్

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 11:నగరంలో ఈ నెల 13వ తేదీ నిర్వహించనున్న గణేశ్ నిమజ్జనోత్సవంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఆకే రవికృష్ణ హెచ్చరించారు. ఎస్పీ ఆదివారం నగరంలో గణేశ్ నిమజ్జనోత్సవం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గణేశ్ నిమజ్జనానికి కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, నగరంలో అణువణువునా పోలీసుల గస్తీ ఉంటుందన్నారు. అలాగే కుల మతాలకు అతీతంగా అత్యంత వైభవంగా నిర్వహించుకునే వినాయక చవితి వేడుకల్లో ఆఖరి ఘట్టమైన గణేశ్ నిమజ్జన కార్యక్రమం, బక్రీద్ పండుగలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకూ నగరమంతా సిసి, వీడియో కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినా, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా సిసి కెమెరాల్లో నిక్షిప్తమై ఉంటుందని, ఆ ఫుటేజీల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అశ్లీల వేషధారణ, నృత్య ప్రదర్శనలను పోలీసుశాఖ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. అనుమానిత వ్యక్తులు తారసపడితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 100కు కానీ సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు కానీ సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే గణేశ్ నిమజ్జనం, బక్రీద్ పండుగలను దృష్టిలో ఉంచుకుని ఎస్పీతో పాటు ఇద్దరు ఏఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 29మంది సిఐలు. 76మంది ఎస్‌ఐలు, 193మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 585 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 48 మంది మహిళా కానిస్టేబుళ్లు, 413 మంది హోంగార్డులు, 4 ప్లాటూన్ల ఏఆర్ సిబ్బంది, 5 ప్లాటూన్ల ఏపిఎస్‌పి సిబ్బంది, 4 స్పెషల్ పార్టీ బృందాలు బందోబస్తులో విధులు నిర్వహిస్తారన్నారు. ఇక 13వ తేదీ గణేశ్ నిమజ్జనం సందర్బంగా ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకూ నగరంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తామన్నారు. మతపెద్దలు, శాంతి కమిటీ సభ్యులు, రాజకీయ పార్టీలు, విద్యార్థులు, యువత నిమజ్జనోత్సవం, బక్రీద్ పండుగలు ప్రశాంత జరిగేందుకు సహాయ సహకారాలు అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.