కర్నూల్

గంగ ఒడికి గణపయ్య..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, సెప్టెంబర్ 13: గణేశ్ నవరాత్రుల్లో భాగంగా ఈ నెల 5 నుంచి 13వ తేదీ వరకు భక్తుల విశేష పూజలందుకున్న గణనాథులు మంగళవారం గంగమ్మ ఒడికి చేరారు. భక్తులు నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసి మేళతాళాలు, డప్పులు, నృత్యాల నడుమ లంబోదరుడిని ఊరేగింపుగా తీసుకెళ్లి వినాయక ఘాట్‌లో నిమ్జనం చేసి పార్వతీ తనయ.. ఇక సెలవు అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత పాతనగరం కుమ్మరివీధిలోని రాంబో ట్ల దేవాలయం వద్ద స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఎంపి బుట్టా రేణుక, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎస్పీ ఆకే రవికృష్ణ, శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు కపిలేశ్వరయ్య, సందడి సుధాకర్, కాళింగ నరసింహవర్మ ప్రత్యేక పూజ లు చేసి శోభయాత్రను ప్రారంభించారు. వినాయకుడి లడ్డూకి వేలం పాట నిర్వహించగా రూ. 27 వేలకు ఆర్యవైశ్య సంఘం నాయకుడు జయం తి వెంకటేశ్వర్లు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపి రేణుక మాట్లాడుతూ ప్రతి ఏటా గణేశ్ నిమజ్జనంలో మొదటి విగ్రహంగా రాంబోట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడికి అవకాశం ఇవ్వడం నిర్వాహకుల అదృష్టమన్నారు. ఇక స్థానిక వినాయక ఘాట్‌లో శ్రీ గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డిప్యూటీ సిఎం కెఇ.కృష్ణమూర్తి, ఎంపి బుట్టా రేణుక, రాజ్యసభ సభ్యులు టిజి.వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్టి, కలెక్టర్ విజయమోహన్, జెసి హరికిరణ్, ఎస్పీ .రవికృష్ణ, ఆర్‌ఎస్‌ఎస్ నేత ఎండివై.రామ్మూర్తి, ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత సంపర్క ప్రముఖ్ ఓలేటి సత్యనారాయణ హాజరయ్యారు. నిమజ్జనోత్సవాన్ని డిప్యూటీ సిఎం కెఇ, ఎంపి టిజి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రాంరభించారు. కలెక్టర్ ధ్వజారోహణం చేయగా భరతమాత పూజను ఎమ్మెల్యే గౌరు చరిత చేశారు. అనంతరం కలెక్టరేట్‌లోని పరిపాలన గణనాథుడికి, రాంబోట్ల దేవాలయం గణనాథుడికి డిప్యూటీ సిఎం, ఎంపిలు టిజి, రేణుక ప్రత్యేక పూజలు చేసి గంగమ్మ ఒడిలోకి నిమజ్జనం చేశారు. దీంతో నిమజ్జనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. నిమజ్జన వేడుకలను తిలకించడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
ఇందులో భాగంగా ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ పరమ శివుడు గణనాథుడి శిరస్సు నరికిన సమయంలో వినాయకుడు తనను తాను శక్తివంతుడిగా మలచుకుని ప్రథమ పూజ్యుడిగా తన తండ్రి వద్ద వరం పొందాడని అలాగే మన దేశం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందన్నారు. వినాయక పండుగ చేయడమంటే ప్రకృతిని గౌరవించడమేనని తెలిపారు. వందేళ్ల క్రితం బాల గంగాధర్ తిలక్ హిందూ, దేశ భక్తి పోరాటం కోసం గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారని అప్పటి నుంచి ఇప్పటి వరకూ మన దేశంలో ఈ పండుగను లక్షలాది మంది ప్రజలు వేడుకగా జరుపుకుంటున్నారన్నారు. ఏదైనా లక్ష్యం సాధించాలంటే గణేశ్ పూజ చేయాలన్నారు. 70 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ దేశ ప్రతిష్టతను ప్రపంచ దేశాలకు తెలిసేలా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. కర్నూలు నగరంలో విభిన్న మతాలకు చెందిన వారు కూడా ఈ వేడుకల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో శ్రీ గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్షుడు కపిలేశ్వరయ్య, సభ్యులు సందడి సుధాకర్, కాళింగ నరసింహవర్మ, కిష్టన్న, నాగఫణిశాస్ట్రి, బిజెపి జిల్లా అధ్యక్షుడు హరీష్‌బాబు, విహెచ్‌పి, బజరంగ్‌దల్, ఏబివిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శోభయాత్రగా వినాయకఘాట్‌కు తరలిన గణనాథులు
వినాయక ఘాట్‌లో నిమజ్జనానికి మొదటి ఊరేగింపుగా రాంబోట్ల దేవాలయం, చిత్తారివీధి, నిమిషాంబ, వన్‌టౌన్ స్టేషన్, పొట్టిశ్రీరాములు, గడియార ఆసుపత్రి, పెద్దమార్కెట్ కూడలి, అంబేద్కర్, కొండారెడ్డి, పెద్దపార్కు, గాంధీనగర్ కూడళ్లు రాజవిహార్ మీదుగా వినాయక ఘాట్‌కు గణనాథులు చేరుకున్నాయి. ఇక రెండవ ఊరేగింపుగా బళ్లారి చౌరస్తా సంపత్ నగర్, పెద్దపాడు, సల్కాపురం, ఎస్‌ఎపి క్యాంపు, కృష్ణారెడ్డి నగర్, వీకర్‌సెక్షన్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, సంతోష్ రైస్‌మిల్, రాజ్‌కిరణ్ వినాయకుడు, న్యూ ఆర్టీసీ చల్లావారి వీధి, పుల్లారెడ్డి నగర్, కూరగాయల మార్కెట్, శివయ్య నగర్, కల్లూరు కూడలి, బంగారుపేట, వౌర్యఇన్ ప్రాంతాలకు చెందిన గణనాథులు వినాయక ఘాట్‌కు చేరుకున్నాయి. మూడవ ఊరేగింపుగా కల్లూరు చౌరస్తా, కృష్ణానగర్ హైవే, హైవే జంక్షన్, బిర్లాగేట్, కొత్త హౌసింగ్ బోర్టు కాలనీ, దినె్నదేవరపాడు, విష్ణు అపార్ట్‌మెంట్స్, బిర్లాగడ్డ, విజ్ఞాన మందిరం కూడలి, టిటిడి కల్యాణ మండపం, మద్దూర్‌నగర్ కూడలి, గాయత్రి ఎస్టేట్ మీదుగా వినాయక ఘాట్‌కు చేరుకున్నాయి.