కర్నూల్

వడదెబ్బతో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకడబూరు, ఏప్రిల్ 19: మండల పరిధిలోని జాలవాడి గ్రామానికి చెందిన గౌళ్ళరాముడు(55) మంగళవారం వడదెబ్బతో మృతి చెందాడు. మృతుడు భార్య శాంతమ్మ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాముడు రెండురోజుల క్రితం గొర్రె పిల్లలను మోపేందుకు గ్రామ శివారుల్లోనే పొలాలకు వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చేలోగా వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. బంధువులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం సోమవారం రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. కోలుకోలేక మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఇంటి యజమాని మృతి చెందడంతో భార్య శాంతమ్మ, కుమారులు కన్నీరు పెట్టుకున్నారు.
పత్తికొండలో ఒకరు..
పత్తికొండ : పట్టణంలోని చాకలివీధికి చెందని కూలి పని చేసుకునే చాకలి నారాయణ(40) సోమవారం వడదెబ్బకు గురై చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా చికిత్స ఫలించగా మంగళవారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గత రెండు రోజుల నుంచి వడదెబ్బకు గురైన నారాయణ స్థానిక ఒక డాక్టర్ వద్ద చికిత్స చేయించుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.