కర్నూల్

నంద్యాల సబ్‌జైలుకు నూతన భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాలటౌన్, సెప్టెంబర్ 27: పట్టణంలో ఉన్న స్పెషల్ సబ్‌జైలు పురాతనమైనదని, దీనిని తరలించడానికి స్థలాన్ని సేకరిస్తున్నట్లు ఈ విషయంపై కలెక్టర్ ఆర్డీఓ దృష్టికి తెచ్చినట్లు జిల్లా జైళ్ల శాఖ అధికారి వరుణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని స్పెషల్ జైలు ఎదుట స్వచ్ఛ్భారత్‌లో భాగం గా నంద్యాల జైలు సూపరింటెండెంట్ అస్లాంబాషా ఆధ్వర్యంలో మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం ఆయ న విలేఖర్లతో మాట్లాడుతూ కొత్త జైలుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని, ప్రస్తుతం ఉన్న జైలులో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి సరైన వసతి, ఖైదీలు ఉండడానికి సరైన గదుల లేకపోవడంతో నూతన జైలు నిర్మాణానికి స్థలాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. స్థల సేకరణ జరిగిన వెంటనే నూతన సబ్‌జైలు నిర్మాణానికి నిధులను మంజూరు చేసి అందు లో ఖైదీలకు ఉపాధి చూపే విధంగా పరిశ్రమలను స్థాపిస్తామన్నారు. ఆదోనిలో కూడా నూతన భవనాలకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఇప్పటికే కర్నూలులో ఇటుకల తయారీ పరిశ్రమను నెలకొల్పామన్నారు. అలాగే ఖైదీలకు బయట నుంచి వచ్చే భోజనాన్ని అనుమతించే ప్రసక్తే లేదన్నారు. జైలు ఆవరణలో మొక్కల పెంపకంలో అధికారుల తీరు ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ జైలర్ లక్ష్మణరావు, చీఫ్ హెడ్‌వార్డర్ ఓబుళరెడ్డి, హెడ్‌వార్డెన్ వెంకటేశ్వరరావు, సిబ్బంది రాజేష్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.