కర్నూల్

మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 27:రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో నిర్వహించే పురపాలక ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతి పాటించాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించినట్లు అధికారులు, అధికార పార్టీ నాయకుల ద్వారా తెలుస్తోంది. స్థానిక సంస్థలకు ప్రస్తుతం ఉన్న అయిదంచెల వ్యవస్థను మూడంచెల వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయిదంచెల వ్యవస్థలో ప్రభుత్వంపై ఆర్థిక భారం, గ్రామాల్లో రాజకీయ వివాదాలకు అవకాశం ఉన్నందున ప్రత్యక్ష పద్ధతి మేలని నిపుణులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సలహాను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించి త్వరలో జరిగే పుర, నగర పాలిక సంఘాల అధ్యక్ష పదవికి ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వార్డు సభ్యుడిగా విజయం సాధించిన వారిలో రిజర్వేషన్ పాటిస్తూ పురపాలక సంఘం అధ్యక్ష, నగర పాలక సంఘం మేయర్ పదవికి అభ్యర్థిని వార్డు సభ్యులు ఎన్నుకుంటున్నారు. ఆయా రాజకీయ పార్టీల నిర్ణయం మేరకు వార్డు సభ్యులు సంఘంలో తమ నేతను ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నుకోవాల్సి ఉంది. సదరు పురపాలక సంఘం అధ్యక్ష, నగర పాలక సంఘం మేయర్ పదవిని అధిష్ఠించిన వ్యక్తిపై ప్రజల్లో సదాభిప్రాయం లేకపోయినా ఆయన పదవీకాలం పూర్తయ్యే కొనసాగే అవకాశం ఉంది. ప్రత్యక్ష ఎన్నిక అమలులోకి వస్తే పురపాలక సంఘం అధ్యక్ష, నగర పాలక మేయర్‌ను ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు. కాగా ప్రత్యక్ష ఎన్నికకు ప్రభుత్వం అంగీకరించి అమలు చేయాలని నిర్ణయిస్తే రానున్న పురపాలక, నగర పాలక ఎన్నికల అధ్యక్ష పదవుల రిజర్వేషన్లు మారుతాయని అధికారులు పేర్కొంటున్నారు. కొత్త పద్ధతిపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటిస్తే రిజర్వేషన్ల అంశంపై చర్చించి కొత్త రిజర్వేషన్లను అమలు చేస్తామంటున్నారు. అయితే దీని కారణంగా ఎన్నికల నిర్వహణలో ఎలాంటి జాప్యం జరగబోదని రిజర్వేషన్ల అంశం తేల్చడానికి రెండు వారాల సమయం చాలని వారంటున్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం కోసం ఆయా రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి.