కర్నూల్

నంద్యాలలో రోడ్ల విస్తరణ జరగకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, అక్టోబర్ 2:నంద్యాలలో రోడ్ల విస్తరణ పూర్తి చేయలేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలిపారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో రోడ్ల విస్తరణ పనుల కోసం ముఖ్యమంత్రితో ఒప్పించి రూ.36కోట్లు మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు. ఆమేరకు సంబంధిత శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం కిందిస్థాయి అధికారులు ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేసి పంపారని, సచివాలయం మార్పుల కారణంగా కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, నవంబర్ నెలలో ఖచ్చితంగా రోడ్ల విస్తరణ పనులు ప్రారంభిస్తామని ఆయన హామీనిచ్చారు. అదే విధంగా నంద్యాల పట్టణంలో తాగునీటి వసతుల కల్పన కోసం వెలుగోడు రిజర్వాయర్ నుంచి నంద్యాల పట్టణానికి 45కి.మీ మేర పైపులైన్ నిర్మాణానికి రూ.88కోట్లు అమృత్ పథకం కింద మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజు నంద్యాల పట్టణ ప్రజల కోసం నీటిని శుద్ధిచేసే ట్రీట్‌మెంట్ ప్లాంటు ఏర్పాటు కోసం రూ.10కోట్లు మంజూరయ్యాయన్నారు. శుద్ధిచేసిన నీరు నిల్వ చేసేందుకు రూ.1.5కోట్ల ఖర్చుతో ఎలివేటేడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు కూడా నిధులు మంజూరయ్యాయన్నారు. మొత్తం నంద్యాల పట్టణానికి తాగునీటి వసతుల కల్పనల కోసం రూ.123కోట్లు మంజూరయ్యాయని ఆయన ప్రకటించారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరి కేవలం 6నెలలు మాత్రమే గడిచిందని, ఈ ఆరునెలల్లో నంద్యాల నియోజకవర్గం అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశానన్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన 10వేల ఇళ్ళ నిర్మాణానికి ఎలాంటి ఢోకా లేదని ఆయన ప్రకటించారు. ఇప్పటికే నందమూరినగర్, వైయస్ ఆర్ నగర్‌లలో 2వేల బోగస్ పట్టాలను వెలికితీశామని, అర్హులైన వారికి ఇంటి పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నంద్యాల పట్టణ శివారుల్లో ఊడుమాల్పురంలో 11 ఎకరాలు, అయ్యలూరు గ్రామంలో ఒక ఎకరా, నంద్యాల పట్టణంలో 1.7 ఎకరాలు, మూలసాగరం పరిధిలో 14 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించామని, ఆ భూమిని సేకరించి పేద ప్రజలకు అందజేయడం జరుగుతుందన్నారు. నంద్యాల పట్టణంలో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీల కోసం వక్ఫ్‌బోర్డు స్థలాన్ని గుర్తించి, ఆ స్థలంలో వారికోసమే ఇళ్ళ నిర్మాణం చేపట్టి అర్హులైన వారందరికీ పంపిణీ చేయడం జరుగుతుందని వక్ఫ్‌బోర్డు స్థలం మంజూరు చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఎమ్మెల్యే నిధుల కింద నంద్యాల నియోజకవర్గానికి రూ. 4కోట్లు మంజూరయ్యాయని, అలాగే కేంద్ర ప్రభుత్వ గ్రాంటు ఎస్‌డిపి కింద నంద్యాల మండలానికి రూ. 4.5కోట్లు, గోస్పాడు మండలానికి రూ. 3.45కోట్లు మంజూరయ్యాయని త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. నంద్యాల పట్టణంలోని కుందూ, చామకాలువ, పాలేరు, మద్దిలేరు వాగుల విస్తరణ, పూడికతీత, రక్షణ గోడల నిర్మాణానికి నిధుల కోసం మళ్లీ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేయించి ఎమ్మెల్యే పదవీ కాలం పూర్తయ్యే లోపల ఆ పనులను కూడా పూర్తి చేస్తానని హామీనిచ్చారు. పాలేరు, పంటకాల్వల స్థలాన్ని కబ్జా చేసిన కారణంగానే పద్మావతినగర్‌లో చిన్నపాటి వర్షానికే వరదనీరు చేరిందని, పాలేరు స్థలాన్ని గుర్తించి వరద కాల్వల నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.