కర్నూల్

మయూర వాహనంపై ఆదిదంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 2:శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రుల్లో రెండో రోజైన ఆదివారం ఆదిపరాశక్తి, శక్తి స్వరూపిణీ అయిన శ్రీభ్రమరాంబదేవి భక్తులకు శ్రీబ్రహ్మచారిణి అలంకారంలో శ్రీ స్వామివారు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నారదుని ఉపదేశానుసారం పరమశివున్ని భర్తగా పొందాలనే సంకల్పంతో బ్రహ్మచారిణిగా మారి కుడిచేతిలో రుద్రాక్షమాల, ఎడమచేతిలో కమండలం కలిగి కందమూలలను, ఆకులను తింటూ కఠోరదీక్షతో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది కనుకనే ఈ దేవిని బ్రహ్మచారిణిగా పిలుస్తారు. ఈమె దీక్షను మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఈదేవికి వరాన్ని ప్రసాదిస్తాడు. ఈదేవిని పూజించిన వారికి సిద్ధవైరాగ్యం కలుగుతుంది. బ్రహ్మచారిణిగా అలంకరించిన అమ్మవారికి అలంకరణ మండపంలో అలంకరణ పూజలను ఆలయ అర్చక వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భాలయం మీదుగా మయూర వాహనంపై స్వామి వారిని మరొకమారు వేద మంత్రోచ్చారణలతో మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా మంగళహారతులు అందించి ఛత్రసామర్లు నిర్వహించి విద్యుత్ దీపకాంతుల నడుమ ఉత్సవమూర్తులను గ్రామోత్సవానికి తోడ్కొని వెళ్లారు. ఈ గ్రామోత్సవంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు భక్తులు అడుగడుగునా నారీకేళ సమర్పణతో కర్పూరహారతులతో నీరజనాలు పట్టారు. ఈగ్రామోత్సవంలో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన జానపద కళారూపాలు, సప్తస్వర విన్యాసాలు, కోలాటాలు, చెక్క్భజనలు, నందికోల సేవ, పగటివేషాలు, బంజారా నృత్యాలు మొదలగు జానపద కళారూపాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బ్యాండుమేళాల నడుమ విన్యాసాలు గ్రామోత్సవానికి మరింత శోభనిచ్చాయి. ఈ విశేష కార్యక్రమంలో ఆలయ ఇఓ నారాయణ భరత్ గుప్త దంపతులు, జెఇఓ హరినాథరెడ్డి దంపతులు, ఎఇఓలు మరియు అర్చక వేద పండితులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల దృష్ట్యా బ్రామరీ కళామందిరంలో 6గంటల నుంచి 6.45నిమిషాల వరకు మూలకుట్ల విశ్వనాథశర్మచే దేవీ భాగవత ప్రవచనం, 7గంటల నుంచి 8గంటల వరకు గౌరీనాథ్ వారిచే కర్నాటక సంగీతం, 8గంటల నుంచి 9గంటల వరకు వేదాంతం నాగవెంకటచలపతి కూచిపూడి యక్షగానం కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకర్షించాయి. ఈకార్యక్రమాలను భారత ప్రభుత్వ దక్షిణాది రాష్ట్రాల సాంస్కృతిక కేంద్రం తాంజావూరు సౌజన్యంతో ఏర్పాటు చేయబడ్డాయి.