కర్నూల్

పని చేస్తున్నాప్రచారం లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలకు రావాల్సినంత ప్రచారం రాలేదని ఆయా పథకాలను ప్రజలకు వివరించి వారి మద్దతు కూడగట్టాల్సిన బాధ్యత పార్టీ నేతలదేనని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా నేతలతో అన్నట్లు తెలుస్తోంది. అమరావతిలో పార్టీ నేతలకు ఇస్తున్న శిక్షణా కార్యక్రమం అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నేతలతో విడివిడిగా కొద్ది సమయం వెచ్చించారని నేతల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని అయిదు రెట్లు పెంచి సకాలంలో పంపిణీ చేస్తున్నా రావాల్సిన ప్రచారం దక్కలేదని తన పరిశీలనలో తేలిందని వెల్లడించినట్లు సమాచారం. పింఛన్ల పంపిణీకి వేలి ముద్రలు వేయించుకోవడం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులకే ఎక్కువ ప్రచారం లభించిందని వాపోయినట్లు నేతలు పేర్కొంటున్నారు. వేలి ముద్రల కారణంగా పింఛన్ చేరాల్సిన వారికే చేరుతుందని, నకిలీలు, అనర్హులకు చేరకుండా ప్రజా ధనం మిగులుతుందన్న విషయం వారిరి నచ్చజెప్పాలని సూచించినట్లు తెలుస్తోంది. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి తాను చేస్తున్న ప్రయత్నం ప్రజలు గుర్తించినట్లు వెల్లడైనట్లు చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. దీన్ని పార్టీ అభివృద్ధికి సానుకూలంగా మార్చుకొని ఇతర పథకాలను ప్రచారం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. పంట కుంటల తవ్వకం కారణంగా భూగర్భ జలాలు గణణీయంగా పెరిగాయని దీన్ని వివరిస్తూ రైతులను మరిన్ని కుంటల తవ్వకానికి ప్రోత్సహించాలని తెలిపారన్నారు. గుండ్రేవుల జలాశయం, వేదవతి ఎత్తిపోతల పథకాలను నిర్మించడం ఖాయమని రైతులకు వివరించాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే తుంగభద్ర దిగువ కాలువ సమస్యలపై కర్నాటక ప్రభుత్వంతో కుదిరిన ఒప్పం దం ప్రకారం త్వరలోనే పనులు చేపట్టి జిల్లాకు రావాల్సిన పూర్తి వాటాను రైతులకు అందిస్తామని వివరించాలని చంద్రబాబు అన్నారని వారంటున్నారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడ నిర్మాణానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ తోడ్పాటునందిస్తుందని, పలు పరిశ్రమల ఏర్పాటుకు సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించారని, ఓర్వకల్లు వద్ద ఒక జలాశయం నిర్మించి మచ్చుమర్రి నుంచి కృష్ణా నీటిని తరలించే కార్యక్రమం వేగవంతం చేస్తామని పేర్కొన్నట్లు నాయకులు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.10వేలు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని చెప్పారన్నారు. కాగా ప్రధానంగా కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికల విషయంలో చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారని, అక్కడ పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయన్న సంకేతాలు వచ్చినట్లు తెలిపారన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున మేయర్ పదవి దక్కించుకోవడానికి స్థానిక నేతలు తీవ్రంగా కృషి చేయాలని, ఇంటింటి ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. తాను త్వరలోనే కర్నూలుకు వస్తానని అక్కడి అన్ని నియోజకవర్గాల్లోని నాయకుల మధ్య ఉన్న మనస్పర్థలపై చర్చించి నిర్ణయాన్ని అక్కడే ప్రకటిస్తానని వెల్లడించారని పేర్కొంటున్నారు. నాయకులు వ్యక్తిగత వ్యవహారాలు పక్కనబెట్టి పార్టీ కోసం పని చేయాలని సూచిస్తూ అందరి పని తీరును తాను గమనిస్తానని, ఎవరికి ఎలాంటి న్యాయం చేయాలో ఎవరి సిఫారసు, వినతులు లేకుండా చేస్తానని చెప్పి పంపారని పేర్కొంటున్నారు.