కర్నూల్

మేయర్ ఎన్నిక ప్రత్యక్షమా.. పరోక్షమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 21:కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది. అయితే మేయర్ పదవికి రిజర్వేషన్ మారే అవకాశం ఉంది. దీనికి తోడు మేయర్ ఎన్నిక ప్రత్యక్షమా.. పరోక్షమా అనే దానిపై నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలు రకాల కారణాలతో ఐదేళ్లకు పైగా ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు న్యాయస్థానం చొరవతో ఆలస్యంగానైనా అధికార వర్గాల్లో కదలిక వచ్చింది. న్యాయస్థానానికి అధికారులు నివేదికలు అందజేశారు. ఇప్పటికే క్షేత్రస్థాయి కసరత్తు ప్రారంభమై ఓటర్ల జాబితా సిద్ధం చేసుకుంటున్నారు. ఆగస్టులో కృష్ణా పుష్కరాలు ఉన్నందున సెప్టెంబర్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం నివేదించినట్లు తెలుస్తోంది. కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలను త్వరగా నిర్వహించాలని న్యాయస్థానం సూచించగా సాధ్యాసాధ్యాలు, సాధక బాధకాలపై ప్రభుత్వ ప్రతినిధులు విన్నంచారు. ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నా క్షేత్రస్థాయిలో ముందస్తు కసరత్తు చేపట్టేందుకు దాదాపు 90 రోజుల గడువు కోరారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఎన్నికలు నిర్వహించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తరపున ఎన్నికల సంఘం తెలిపింది. ముందస్తు కసరత్తు పూర్తి కాగానే దాదాపు 50 రోజులు ఎన్నికల నిర్వహణకు అవసరం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందస్తు కసరత్తుకు నిర్ణీత గడువు అవసరం కావడంతో సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఓటర్ల చేర్పులు, మార్పులు, సవరణపై ఇంటింటి విచారణ జరుగుతుండటంతో త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి మే 16వ తేదీ లోగా తుది జాబితా ప్రచురణ చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మే 28లోగా డివిజన్ల వారీగా ఓటరు జాబితా ప్రకటించి, అప్పటి నుంచి 40 రోజుల పాటు సమయం తీసుకుని జూలై 5వ తేదీ లోగా క్షేత్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళా గణన చేపట్టాలనే యోచనలో ఉన్నారు. జూలై 25లోగా కేటగిరి వారీగా డివిజన్ల రిజర్వేషన్లు ప్రకటించాలని నివేదికలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. జూలై 30వ తేదీ నగర పాలక సంస్థ ద్వారా పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకటన చేయనున్నారు. ఆగస్టు 8వ తేదీ తుది ప్రచురణ, 18న ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాలని న్యాయస్థానానికి అందించిన నివేదికల్లో అధికారులు విన్నవించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పాలకవర్గం పదవీ కాలం ముగిసి 6 ఏళ్లు పూర్తి అయింది. గతంలో ఎన్నికల నిర్వహణపై సంకేతాలు అంది క్షేత్రస్థాయిలో పలు రకాల గణనలు పూర్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరగటంతో రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా తాజాగా నిర్వహించాల్సి ఉంది. గతంలో నగరపాలక అధ్యక్ష స్థానం బిసి మహిళకు ఖరారు కాగా, ప్రస్తుతం రిజర్వేషన్ మారే అవకాశం ఉంది.